News August 8, 2024
నందిగం: వరకట్నం కేసులో నలుగురికి జైలు, జరిమానా

నందిగం మండలం దొడ్ల రామచంద్రాపురం గ్రామానికి చెందిన కర్రి హేమలతను వరకట్నం కోసం వేధించిన కేసులో ఆమె భర్త నర్తు హేమరాజు, అత్త కనకమ్మ, గోపాలరావు, సరోజినీలకు జైలుశిక్ష జరిమానా విధిస్తూ బుధవారం టెక్కలి జూనియర్ సివిల్ జడ్జి ఎస్‌హెచ్‌ఆర్ తేజాచక్రవర్తి తీర్పును వెల్లడించారు. 2018లో నందిగంలో నమోదు అయిన వరకట్నం వేధింపుల కేసు రుజువు కావడంతో భర్తకు 11 నెలలు, మిగతా ముగ్గురికి మూడు నెలలు జైలు శిక్ష విధించారు.
Similar News
News February 24, 2026
సారవకోట: జిల్లా గ్రంథాలయ సంస్థలో ఖాళీగా 70 ఉద్యోగాలు

జిల్లా గ్రంథాలయ సంస్థలో 70 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని వాటిని భర్తీ చేయాల్సి ఉందని జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి శంకరరావు తెలిపారు. సారవకోట మండల కేంద్రంలోని శాఖా గ్రంథాలయాన్ని మంగళవారం ఆయన సందర్శించి రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లా గ్రంథాలయ సంస్థకు జిల్లా పట్టణ, గ్రామీణ పంచాయతీల నుంచి రావలసిన 8% గ్రంథాలయ సెస్సులను ప్రభుత్వం విడుదల చేయాలని కోరారు.
News February 24, 2026
శ్రీకాకుళం: జిల్లా స్థాయి సైక్లింగ్ పోటీల నిర్వహణ

శ్రీకాకుళంలోని కోడి రామ్మూర్తి స్టేడియంలో మంగళవారం జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో సైక్లింగ్ పోటీలు నిర్వహించారు. అండర్-18 పురుషులు, మహిళల విభాగంలో ఈ పోటీలు జరిగాయి. జిల్లా క్రీడాభివృద్ధి అధికారి మహేశ్ బాబు పోటీలను పర్యవేక్షించారు. విజేతలు ఈనెల 28న ఎన్టీఆర్ జిల్లాలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు.
News February 24, 2026
శ్రీకాకుళం: ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షకు 312 మంది గైర్హాజరు

శ్రీకాకుళం జిల్లాలోని 71 పరీక్షా కేంద్రాల్లో మంగళవారం జరిగిన ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ పరీక్షకు 312 మంది గైర్హాజరైనట్లు జిల్లా ఆర్ఐఓ ఆర్.సురేష్ కుమార్ తెలిపారు. మొత్తం 19,158 మంది పరీక్షకు హాజరుకావాల్సి ఉండగా 18,840 మంది విద్యార్థులు పరీక్షకు హాజరైనట్లు పేర్కొన్నారు. 98.34 హాజరు శాతం నమోదు అయినట్లు ఆయన వెల్లడించారు.


