News July 15, 2024

నందిగాం: గుండెపోటుతో ఏఎస్సై మృతి

image

కాకినాడ జిల్లా గొల్లప్రోలులో ఏఎస్సైగా విధులు నిర్వహిస్తున్న జి.కృష్ణారావు గుండెపోటుతో మృతి చెందారు. నందిగాం మండలం కల్లాడ గ్రామానికి చెందిన కృష్ణారావు కాకినాడ డీసీఆర్బీలో ఏఎస్సైగా పని చేశారు. కాకినాడలోని రాయుడుపాలెంలో తన నివాసంలో ఆదివారం మధ్యాహ్నం కృష్ణారావుకు గుండెపోటు రావడంతో ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యంలోనే తుది శ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

Similar News

News February 26, 2026

శ్రీకాకుళం: పొన్నాడ వంతెన వద్ద వ్యక్తి దారుణ హత్య?

image

శ్రీకాకుళం వాంబే కాలనీకి చెందిన పైల మోహన్ రావు (40) పొన్నాడ వంతెన సమీపంలో గురువారం శవమై కనిపించారు. గత రెండు రోజులుగా ఆచూకీ లేని మోహన్‌రావు కోసం కుటుంబ సభ్యులు గాలిస్తుండగా, రక్తపు మడుగులో విగతజీవిగా పడి ఉన్నాడు. మృతుని తలపై తీవ్ర గాయాలు ఉండటంతో ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేసినట్లు అనుమానిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News February 26, 2026

శ్రీకాకుళం: పాత పైప్‌లైన్ల తొలగింపు

image

శ్రీకాకుళంలో డయేరియా ప్రబలడానికి నీటి కాలుష్యమే ప్రధాన కారణమని భావిస్తున్న అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. ట్యాంకర్ల ద్వారా స్వచ్ఛమైన నీటిని అందిస్తున్నారు. డ్రైనేజీల పక్కన ఉన్న పాత పైప్‌లైన్లను యుద్ధ ప్రాతిపదికన తొలగిస్తున్నారు. సేకరించిన 412 వాటర్ శాంపిల్స్‌ను పరీక్షల నిమిత్తం విశాఖపట్నం ల్యాబ్‌లకు పంపగా, ప్రాథమిక రిపోర్టుల ప్రకారం నీరు సురక్షితంగానే ఉన్నట్లు సమాచారం.

News February 26, 2026

శ్రీకాకుళం: గూడ్స్ రైలు నుంచి విడిపోయిన బోగీలు

image

మందస మండలం మకరజోల వద్ద విశాఖ నుంచి కోల్‌కతా వైపునకు వెళ్తున్న గూడ్స్ రైలు ఆరు బోగీలు విడిపోయాయి. మిగిలిన బోగీలతో 100 మీటర్లు ముందుకు వెళ్లి నిలిపివేశారు. దీంతో మకరజోల మీదుగా ఉద్దానం గ్రామాలకు వెళ్లే రహదారిపై రైలు క్రాసింగ్ వద్ద వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. స్థానికులు గంటపాటు ఇబ్బందులు పడ్డారు.