News August 24, 2025
నందిగామలో భారీ కొండచిలువ

నందిగామ శివారు అనాసాగరంలో రైతులకు భారీ కొండచిలువ కనిపించింది. ట్రాక్టర్ దమ్ము చేస్తుండగా కొండచిలువ కనిపించడంతో రైతు ఆందోళన చెంది దానిని హతమార్చారు. మున్నేరుకు భారీగా వరదలు రావడంతో తరచూ పాములు కొట్టుకు వస్తున్నాయని తెలిపారు. పాము కాట్లతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు చెప్పారు.
Similar News
News August 24, 2025
ట్యాక్స్ పేయర్స్ అత్యధికంగా ఉన్న టాప్-10 రాష్ట్రాలివే!

ఇన్‌కమ్ ట్యాక్స్ డేటా (FY 2024-25) ప్రకారం దేశంలో అత్యధిక శాతం పన్ను చెల్లింపుదారులున్న (వార్షిక ఆదాయం ₹12L-₹50L) రాష్ట్రాల్లో కర్ణాటక (20.6%) తొలి స్థానంలో ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా TG(19.8), ఝార్ఖండ్(19.5), TN(18.8), ఢిల్లీ (17.6), పుదుచ్చేరి(17.4), ఒడిశా(16.8), MH(16.2), AP(15.9), ఉత్తరాఖండ్(14.2) ఉన్నాయి. కాగా రిచ్ స్టేట్‌గా పేరొందిన గుజరాత్(7%) ఈ లిస్టులో Top-10లో లేకపోవడం గమనార్హం.
News August 24, 2025
మచిలీపట్నంలో సైకిలింగ్ చేసిన ఎస్పీ

ఫిట్ ఇండియా కార్యక్రమంలో భాగంగా జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం మచిలీపట్నంలో సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఎస్పీ ఆర్. గంగాధరరావు స్వయంగా సైకిలింగ్‌లో పాల్గొన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయం నుంచి కోనేరుసెంటర్ వరకు జరిగిన సైకిలింగ్‌లో ఎస్పీతో పాటు అడిషనల్ ఎస్పీ సత్యనారాయణ, వందలాది మంది పోలీసులు పాల్గొన్నారు.
News August 24, 2025
తిరుపతి: ఒక్కడే 53 బైకులు దొంగలించాడు!

తిరుపతిలో బైకులను మాయం చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. తిరుచానూరుకు చెందిన P.కుమార్ సులభ్ కాంప్లెక్స్‌లో పనిచేస్తుంటాడు. జల్సాలకు అలవాటై దొంగతనాలు చేస్తున్నాడు. పాత రేణిగుంట రోడ్డులో జులై 6న బైక్ దొంగతనం జరిగింది. ఈ కేసులో దర్యాప్తు చేయగా కుమార్ పట్టుబడ్డాడు. తిరుపతి, చంద్రగిరి, ఏర్పేడు, శ్రీకాళహస్తి పరిధిలో రూ.40 లక్షల విలువైన 53 బైకులు దొంగలించగా వాటిని పోలీసులు రికవరీ చేశారు.