News August 13, 2025
నందిగామ ఆర్డీవో కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు

నందిగామ రెవెన్యూ డివిజన్ పరిధిలోగల కృష్ణానది పరిసర గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆర్డీవో బాలకృష్ణ సూచించారు. ఎగువ ప్రాజెక్టు నుంచి భారీ వరదలు వస్తున్న నేపథ్యంలో పులిచింతల ప్రాజెక్టు నుంచి ప్రకాశం బ్యారేజ్‌కి వరద నీరు విడుదల అవుతుందన్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆయన అధికారుల ఆదేశించారు. కంట్రోల్ రూమ్ నంబర్ 7893053534ను సంప్రదించాలన్నారు.
Similar News
News August 13, 2025
గురజాడ స్వగృహంలో దుశ్చర్య.. నివేదికలో అంశాలు ఇవే..!

విజయనగరం పట్టణంలోని మహాకవి గురజాడ స్వగృహంలో ఓ వ్యక్తి చేసిన విధ్వంసంపై కలెక్టర్ సీరియస్ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జిల్లా పర్యాటక అధికారి కుమారస్వామి గురజాడ ఇంటిని సందర్శించారు. మద్యం మత్తులో చేసినట్లు ఆయన గుర్తించారు. గురజాడ కుటుంబ సభ్యుల సూచనలతో ఐరెన్ రైలింగ్, పోలీస్ పెట్రోలింగ్, వెనుక భాగంలో కందకం లోతు పెంపు, సీసీ కెమెరాల ఏర్పాటుకు నివేదిక సిద్ధం చేసి కలెక్టర్‌కు అందజేశారు.
News August 13, 2025
మెదక్: క్రీడల్లో ఉద్యోగుల ఉత్తమ ప్రతిభ: కలెక్టర్

మెదక్ జిల్లా కేంద్రంలో స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకొని యువజన క్రీడల నిర్వహణ శాఖ నిర్వహించిన క్రీడల్లో ఉద్యోగులు ఉత్తమ ప్రతిభ కనబరుస్తున్నారని కలెక్టర్ రాహుల్ రాజ్ పేర్కొన్నారు. క్రీడల్లో పాల్గొని క్రీడాకారులను ఉత్తేజపరిచారు. క్రీడల్లో 1090 మంది ఉద్యోగులు నమోదు చేసుకున్నట్లు వివరించారు. ఆర్డీవో రమాదేవి, యువజన క్రీడల నిర్వహణ అధికారి దామోదర్ రెడ్డి పాల్గొన్నారు.
News August 13, 2025
తుఫాన్ ఎఫెక్ట్.. ప్రకాశం కలెక్టర్‌కు మంత్రి స్వామి ఫోన్..!

ప్రకాశం జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియాతో మంత్రి డాక్టర్ స్వామి బుధవారం ఫోన్‌లో మాట్లాడారు. తుఫాను హెచ్చరికల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని మంత్రి ఆదేశించారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని ఆయన కోరారు.