News April 19, 2025
నంద్యాలకు వెళ్తుండగా యాక్సిడెంట్.. భార్యాభర్తలు మృతి

గద్వాల జిల్లాలో తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్‌కు చెందిన ధర్మారెడ్డి కుటుంబ సభ్యులంతా కలిసి నంద్యాలకు కారులో వెళ్తున్నారు. గద్వాల జిల్లా ఇటిక్యాల మండలంలోని ప్రియదర్శి హోటల్ ముందు జాతీయ రహదారిపై సోమవారం తెళ్లవారుజామున వారి కారు అదుపుతప్పి బోల్తా పడింది. కారులో మొత్తం ఆరుగురు ఉండగా అందులో పుల్లారెడ్డి, లక్ష్మీసుబ్బమ్మ భార్యాభర్తలు అక్కడికక్కడే మృతి చెందారు.
Similar News
News December 26, 2025
శుక్రవారం వ్రతం ఎలా చేయాలి?

శుక్రవారం వ్రతం ఉదయాన్నే ప్రారంభించాలి. తెల్లవారుజామున శుచిగా స్నానం చేసి, ఉపవాసం ఉండాలి. పూజా స్థలాన్ని శుభ్రం చేసి, లక్ష్మీదేవి పటం/విగ్రహం పెట్టుకోవాలి. దీపం వెలిగించి అమ్మవారికి పసుపు, కుంకుమ, పూలు, పండ్లు, బెల్లం, శనగలు OR ఖీర్/పాయసం వంటి నైవేద్యాలు సమర్పించాలి. వ్రత కథ చదివి లేదా విని, అమ్మవారి మంత్రాలు జపించాలి. సాయంత్రం దీపం వెలిగించి, పూజ ముగించి, నైవేద్యం స్వీకరించి, ఉపవాసం విరమించాలి.
News December 26, 2025
MDK: సర్పంచ్ ఫోరం అధ్యక్షుడి ఎన్నికలో ట్విస్ట్‌లు!

చిన్నశంకరంపేటలో బుధవారం ఓ ఫంక్షన్ హల్లో సర్పంచులు మీటింగ్ ఏర్పాటు చేసి సర్పంచుల ఫోరం అధ్యక్షుడిగా కామారం తండా సర్పంచ్ మోహన్ నాయక్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ప్రకటన విడుదల చేశారు. ఇదిలా ఉండగా గురువారం 31 గ్రామపంచాయతీలలోని 16 మంది సర్పంచులు పార్టీలకతీతంగా చిన్నశంకరంపేట సర్పంచ్ NRI కంజర్ల చంద్రశేఖర్‌ను సర్పంచ్ల ఫోరమ్ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తెలిపారు.
News December 26, 2025
ఈ నెల 27న విజయవాడ రానున్న బోయపాటి

నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ-2 చిత్రాన్ని ప్రేక్షకులతో కలసి వీక్షించేందుకు ఆ చిత్ర దర్శకుడు బోయపాటి శ్రీను విజయవాడ రానున్నారు. ఈ నెల 27న రాత్రి 9 గంటలకి విజయవాడ శైలజ థియేటర్‌లో బోయపాటి.. అఖండ-2 వీక్షిస్తారని తాజాగా సమాచారం వెలువడింది. అనంతరం 28న బోయపాటి గుంటూరు, ఒంగోలులో సైతం థియేటర్‌లలో ఆడియన్స్‌తో కలసి అఖండ మూవీ చూస్తారని తెలుస్తోంది.


