News March 30, 2025
నంద్యాలలో ఆకస్మిక తనిఖీలు

నంద్యాల పట్టణం నందమూరి నగర్‌లోని ఆవాసియ విద్యాలయాన్ని బుడగజంగాల రాష్ట్ర సమగ్ర శిక్ష ఐఈడీకో ఆర్డినేటర్ కల్పనా ఆకస్మికంగా తనిఖీ చేశారు. హాస్టల్ పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. రికార్డులను పరిశీలించారు. భోజనాలు, వసతులపై సంతృప్తిని వ్యక్తం చేశారు. ఆమె వెంట సీఆర్పిీ హిమశేఖర్, చంద్రమ్మ , గాయత్రి , హాస్టల్ సిబ్బంది పాల్గొన్నారు.
Similar News
News April 1, 2025
రేపు వరంగల్ మార్కెట్ పునః ప్రారంభం

మూడు రోజుల విరామం అనంతరం వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ బుధవారం పునః ప్రారంభం కానుంది. శనివారం అమావాస్య, ఆదివారం వారాంతపు సెలవు, సోమవారం మంగళవారం రంజాన్ సందర్భంగా సెలవు కావడంతో మార్కెట్ బంద్ ఉంది. దీంతో రేపు ప్రారంభం కానుండగా.. రైతులు నాణ్యమైన సరుకులను మార్కెటుకు తీసుకొని వచ్చి మంచి ధర పొందాలని అధికారులు సూచించారు. కాగా, ఉదయం 6 గంటల నుంచి మార్కెట్లో కొనుగోళ్లు ప్రారంభం కానున్నాయి.
News April 1, 2025
కర్నూలులో మొదటి రోజు 93% పూర్తయిన పింఛన్ల పంపిణీ

కర్నూలు జిల్లాలోని 29 మండలాల్లో మంగళవారం చేపట్టిన పింఛన్ పంపిణీ 93% పూర్తయినట్లు అధికారులు వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా 2,38,302 మంది పింఛన్ లబ్ధిదారులు ఉండగా, మొదటి రోజు 2,21,701 మందికి పింఛన్ పంపిణీ పూర్తయింది. ఇంకా 16,601 మందికి పింఛన్ పంపిణీ చేయాల్సి ఉంది. కాగా జిల్లాలోని కర్నూల్ అర్బన్‌లో 95% పంపిణీతో మొదటి స్థానం, 88%తో తుగ్గలి మండలం చివరి స్థానంలో ఉన్నట్లు అధికారులు తెలిపారు.
News April 1, 2025
అత్యధిక ఫాలోవర్లు కలిగిన జట్లివే!

IPL ట్రోఫీల్లోనే కాదు సోషల్ మీడియా ఫాలోయింగ్‌లోనూ చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్లు తగ్గేదే లే అంటున్నాయి. ఇన్‌స్టా, ట్విటర్, ఫేస్‌బుక్ ఖాతాల్లో కలిపి CSKకి మొత్తం 42.6 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు. ఆ తర్వాత ముంబైకి 38.5M, RCBకి 35.1M, KKRకి 30.3M, DCకి 16.1M, PBKSకి 15.9M, SRHకి 15.2M, RRకి 13M, GTకి 6.9M మంది ఫాలోవర్లున్నారు. ఇంతకీ మీరు ఏ టీమ్‌ను సపోర్ట్ చేస్తున్నారు? COMMENT