News December 6, 2025
నంద్యాలలో ఘనంగా 63 వ హోంగార్డు వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు

నంద్యాల జిల్లా పోలీసు కార్యాలయంలో ఘనంగా 63 హోంగార్డు వ్యవస్థాపక దినోత్సవ వేడుకలను నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. హోంగార్డులు నైపుణ్యతను పెంచుకొని పోలీసులకు దీటుగా విధి నిర్వహణ చేస్తున్నారని తెలిపారు. వారి సేవలు అద్భుతమని, అభినందనీయమని తెలిపారు.
Similar News
News December 6, 2025
జగిత్యాల: తల్లిదండ్రులను విస్మరిస్తే జైలుశిక్ష తప్పదు

వృద్ధ తల్లిదండ్రులను పోషించడం పిల్లల చట్టబద్ధ బాధ్యత అని, నిర్లక్ష్యం చేస్తే జైలు, జరిమానా తప్పవని జగిత్యాల ఆర్డీవో మధుసూదన్ హెచ్చరించారు. ఆర్డీవో ఛాంబర్‌లో గుల్లపేట, మల్లన్నపేట్, అల్లీపూర్, పూడూర్ గ్రామాల వృద్ధుల నిరాధారణ కేసులను విచారించారు. వయోవృద్ధుల తరఫున సీనియర్ సిటిజెన్స్ జిల్లా అధ్యక్షుడు హరి అశోక్ కుమార్ వాధించారు. ఈ కార్యక్రమంలో అధికారులు రవికాంత్, హన్మంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
News December 6, 2025
హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్‌లో పోస్టులు

హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్(<
News December 6, 2025
ధర్మపురి: జిల్లా వ్యాప్తంగా ముమ్మరంగా వాహన తనిఖీలు: ఎస్పీ

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో జగిత్యాల జిల్లా వ్యాప్తంగా వాహన తనిఖీలను ముమ్మరంగా చేపట్టనున్నట్లు ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. ధర్మపురి పోలీస్ స్టేషన్ పరిధిలోని రాయపట్నం చెక్ పోస్టును, వెల్గటూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కిషన్ రావు పేట పోలింగ్ కేంద్రాన్ని శనివారం పరిశీలించారు. ఎన్నికలకు సంబంధించి ఎవరైనా అనుచిత చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.


