News January 25, 2025
నంద్యాలలో డ్రోన్ల వినియోగంతో ట్రాఫిక్ పర్యవేక్షణ

నంద్యాల జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా ఆదేశాల మేరకు నంద్యాలలోని సంజీవ నగర్ గేట్, మున్సిపల్ ఆఫీస్, శ్రీనివాస సెంటర్లో శుక్రవారం ట్రాఫిక్ నియంత్రణకు పోలీసు అధికారులు డ్రోన్లను వినియోగించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించిన వారిని గుర్తించి జరిమానా విధించారు. అలాగే ట్రాఫిక్ రూల్స్ గురించి వాహనదారులకు వివరించారు.
Similar News
News March 14, 2025
15 నుంచి ఒంటిపూట బడులు

వేసవి తీవ్రత దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ లోకల్ బాడీ పాఠశాలలకు ఈనెల 15 నుండి ఏప్రిల్ 23 వరకు ఒంటిపూట బడులు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు పాఠశాలలు నిర్వహించాలని ఆదేశించింది. జిల్లా విద్యాశాఖ అధికారులు మండల విద్యాశాఖ అధికారుల ద్వారా ఉత్తర్వులను, సమయ సరళిని పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు పంపిణీ చేయాలని ఆదేశించింది.
News March 14, 2025
నిర్మల్: రేపటి నుంచి ఒంటి పూట బడులు

రాష్ట్ర విద్యాశాఖ ఆదేశాల మేరకు ఈనెల 15 నుంచి అన్ని పాఠశాల యాజమాన్యాలు ఒంటిపూట బడులు నిర్వహించాలని నిర్మల్ డీఈఓ రామారావు గురువారం ప్రకటనలో తెలిపారు. వారు మాట్లాడుతూ 15వ తేదీ నుంచి విద్యా సంవత్సరం ముగిసే వరకు ఉదయం 8మధ్యాహ్నం 12:30 వరకు పాఠశాలలు నిర్వహించాలని ఆదేశించారు. పదో తరగతి విద్యార్థులకు మధ్యాహ్నం 1 నుంచి 5 గంటల వరకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలన్నారు.
News March 14, 2025
గోపాలమిత్ర కుటుంబీకులకు లక్ష ఆర్థిక సహాయం

సిద్దిపేట మండలానికి చెందిన గోపాలమిత్ర మార్గడి వెంకట్ రెడ్డి కొద్దిరోజుల క్రితం మృతి చెందాడు. ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన గోపాలమిత్ర సభ్యులు ఈరోజు మృతుడి కుటుంబీకులకు రూ. లక్ష ఆర్థిక సహాయం అందజేశారు. కార్యక్రమంలో మెదక్ జిల్లా గోపాలమిత్ర అధ్యక్షులు పల్లెపాటి అశోక్, సిద్దిపేట జిల్లా అధ్యక్షులు సింగం రాజు యాదవ్, రాష్ట్ర సలహాదారు శ్రీరాములు, మహిపాల్ రెడ్డి, రామస్వామి, సత్తార్, గౌరీ శంకర్ పాల్గొన్నారు.