News October 13, 2025
నంద్యాలలో నేడు ఎస్పీ PGRS రద్దు

నంద్యాల జిల్లాలోని SP కార్యాలయంలో సోమవారం జరగవలసిన ప్రజా సమస్యల పరిష్కార వేదికను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు SP సునీల్ షెరాన్ తెలిపారు. అనివార్య కారణాలవల్ల తాత్కాలికంగా కార్యక్రమాన్ని వాయిదా వేయడం జరిగిందని అన్నారు. కాబట్టి ప్రజలు ఎవరూ జిల్లా కేంద్రానికి రావద్దని సూచించారు. అక్టోబర్ 20వ తేదీన తిరిగి PGRSను యధావిధిగా కొనసాగిస్తామని ఆయన అన్నారు.
Similar News
News October 13, 2025
మెదక్: బాణాసంచ విక్రయాలకు ముందస్తు అనుమతి తప్పనిసరి: ఎస్పీ

దీపావళి పండుగ సందర్భంగా తాత్కాలిక టపాకాయల (బాణాసంచా) దుకాణాలు ఏర్పాటు చేసే వ్యాపారులు ముందస్తుగా అనుమతి పొందడం తప్పనిసరి అని ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు తెలిపారు. వ్యాపారులు తమ దరఖాస్తులను సంబంధిత సబ్ డివిజన్ పోలీస్ అధికారి కార్యాలయంలో సమర్పించాలని ఆయన సూచించారు. మార్గదర్శకాల కోసం కూడా సబ్ డివిజన్ పోలీస్ అధికారిని సంప్రదించాలని ఎస్పీ పేర్కొన్నారు.
News October 13, 2025
నల్లదారం కట్టుకోవడం వెనుక ఆంతర్యం

హిందూ సంస్కృతిలో నలుపు రంగును ప్రతికూల శక్తులను శోషించుకునే శక్తిగా భావిస్తారు. దీన్ని నర దిష్టి, చెడు దృష్టి నుంచి రక్షణగా ధరిస్తారు. అందుకే చిన్న పిల్లలకు, పెళ్లి కొడుకు/కూతర్లకు దిష్టి చుక్క పెడతారు. అలాగే నల్ల దారం కూడా దైవిక కవచంలా పనిచేస్తుందని పండితుల వాక్కు. మనపై దుష్ట శక్తులు ప్రభావం పడకుండా ఇది అడ్డుకుంటుందని నమ్మకం. రోగాలు, అరిష్టాలు పోయి సానుకూల శక్తి పెరుగుతుందని విశ్వసిస్తారు.
News October 13, 2025
MBNR: దీపావళి.. నియమాలు తప్పనిసరి:SP

దీపావళి సందర్భంలో టపాసుల విక్రయదారులు తప్పనిసరిగా చట్టపరమైన నియమాలను పాటించాలని జిల్లా ఎస్పీ డి.జానకి అన్నారు. టపాసుల విక్రయ దుకాణాలు రద్దీ ప్రదేశాలు, ట్రాఫిక్ ఎక్కువగా ఉండే ప్రాంతాలు, విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు, పెట్రోల్ బంకులు సమీపంలో అలాగే వివాదాస్పద స్థలాలలో ఏర్పాటు చేయరాదన్నారు. ప్రజలు భద్రతా నియమాలు పాటిస్తూ.. పిల్లలను పెద్దల పర్యవేక్షణలో టపాసులు కాల్చేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.