News February 2, 2025
నంద్యాలలో పాత కక్షలతో వ్యక్తిపై కత్తితో దాడి
పాత కక్షల కారణంగా ఓ వ్యక్తిపై మరో వ్యక్తి కత్తితో దాడి చేసిన ఘటన నంద్యాలలోని ఆర్టీసీ బస్టాండు సమీపంలో శనివారం రాత్రి చోటుచేసుకుంది. పట్టణ శివారు ప్రాంతంలోని నందమూరి నగర్‌కు చెందిన గౌస్‌కు రోజాకుంట వీధికి చెందిన హరికి మధ్య మనస్పర్థలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో బస్టాండ్ వద్ద వీరిద్దరూ ఎదురుపడగా హరిపై గౌస్ కత్తితో దాడి చేశాడు. నంద్యాల వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News February 2, 2025
నూతన డీజీపీని కలిసిన ప.గో ఎస్పీ
ఏపీ నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో ఆయనను ప.గో ఎస్పీ అద్నాన్ నయీం అస్మి మర్యాదపూర్వకంగా కలిశారు. డీజీపీకి పూల మొక్క అందజేశారు. అనంతరం జిల్లాలోని లా అండ్ ఆర్డర్ గురించి డీజీపీకి వివరించారు.
News February 2, 2025
రామ్‌దేవ్ బాబాపై అరెస్ట్ వారెంట్
యోగా గురువు రామ్‌దేవ్ బాబాపై కేరళలోని ఓ కోర్టు నాన్-బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. పతంజలి ఉత్పత్తుల ప్రకటనలతో రామ్‌దేవ్, ఆ సంస్థ సహ వ్యవస్థాపకుడు ఆచార్య బాలకృష్ణ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారని కేరళ డ్రగ్స్ ఇన్‌స్పెక్టర్ వారిపై కేసు నమోదు చేశారు. ఆ కేసు విచారణకు రావాలని ఆదేశించినా వారు రాకపోవడంతో కోర్టు తాజా తీర్పునిచ్చింది.
News February 2, 2025
వైరస్: లక్షల సంఖ్యలో కోళ్లు మృతి
AP: ఉమ్మడి ప.గో. జిల్లాలో భారీ సంఖ్యలో కోళ్లు మృతి చెందడం కలకలం రేపుతోంది. అంతుచిక్కని వైరస్ DECలో మొదలై JAN నుంచి విజృంభిస్తోందని పౌల్ట్రీ రైతులు చెబుతున్నారు. ఇప్పటికే లక్షకు పైగా కోళ్లు చనిపోయాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శాంపిల్స్ భోపాల్ పంపుతున్నారు. 2012, 20లోనూ ఈ వైరస్ వచ్చిందని, ప్రభుత్వం విపత్తుగా పరిగణించాలని కోరుతున్నారు. అటు ఖమ్మం జిల్లాలోనూ వేల సంఖ్యలో కోళ్లు చనిపోయాయి.