News February 18, 2026

నంద్యాలలో పి-4 కార్యక్రమంపై కలెక్టర్ సమీక్ష

image

నంద్యాల జిల్లాలో పేదరిక నిర్మూలన లక్ష్యంగా అమలు చేస్తున్న పి-4 కార్యక్రమాన్ని సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లాలని కలెక్టర్ రాజకుమారి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో ఈ కార్యక్రమం పురోగతిపై చర్చించారు. ఇప్పటివరకు జిల్లాలో పేదరికంతో బాధపడుతున్న 50,038 బంగారు కుటుంబాలను గుర్తించినట్లు కలెక్టర్ వెల్లడించారు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో పేదరికాన్ని పారద్రోలాలని సూచించారు.

Similar News

News February 19, 2026

ఇన్‌‌స్టా పరిచయం.. ఝార్ఖండ్ నుంచి బందరుకు వివాహిత

image

ఝార్ఖండ్ రాష్ట్రానికి చెందిన 30 ఏళ్ల వివాహిత సోషల్ మీడియాలో పరిచయమైన వ్యక్తి మాయలో పడి మచిలీపట్నానికి వచ్చిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. భర్త, ముగ్గురు పిల్లలను వదిలి ఆమె వచ్చినట్లు సమాచారం. ఇక్కడికి వచ్చాక అతను దినసరి కూలీ అని తెలుసుకున్న ఆమె మోసపోయానని గ్రహించింది. పోలీసుల జోక్యం, తల్లిదండ్రులు నచ్చజెప్పడంతో ఆమె తిరిగి ఇంటికి చేరుకుంది.

News February 19, 2026

జిల్లా నంబర్‌ వన్‌గా ఉండాలి: జనగామ కలెక్టర్

image

పదో తరగతి వార్షిక పరీక్షల్లో జనగామను రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలపడమే లక్ష్యంగా పని చేయాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అధికారులను ఆదేశించారు. ‘విజయోస్తు 2.0’ కార్యక్రమం ద్వారా విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ, అవగాహన కల్పించాలని ఉపాధ్యాయులకు సూచించారు. వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించి, వారిని ఉత్తీర్ణులుగా చేసేలా కార్యాచరణ రూపొందించినట్లు తెలిపారు.

News February 19, 2026

పెద్దపల్లి: ‘ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలుచేయాలి’

image

పెద్దపల్లి పట్టణంలోని మదర్ తెరిసా ఇంజనీరింగ్ కళాశాలలో గురువారం ధర్మారం, అంతర్గాం, ఎలిగేడు, జూలపల్లి, రామగిరి, ముత్తారం, మంథని మండలాల నూతనంగా ఎన్నికైన సర్పంచులకు రెండో విడత శిక్షణ కార్యక్రమం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి DPO వీర బుచ్చయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రజా ప్రతినిధులు ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేయాలని ఆయన సూచించారు. DLPO లు, MPO లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.