News January 26, 2025

నంద్యాల: అంతర్జాతీయ క్రీడాకారుడు ASIకి అభినందనల వెల్లువ

image

పాణ్యం మండల కేంద్రానికి చెందిన అంతర్జాతీయ కబడ్డీ క్రీడాకారుడు సీ.నాగ గోపేశ్వరరావు రిపబ్లిక్ డే వేడుకల సందర్భంగా ఉత్తమ అధికారిగా ఎంపికయ్యారు. గుంతకల్లు డివిజన్లో రైల్వే ఏఎస్ఐగా పనిచేస్తూ విధి నిర్వహణలో ఉత్తమ సేవలకు గాను ఆయన ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. గ్రామానికి చెందిన పలువురు క్రీడాకారులు, గ్రామ పెద్దలు, ప్రజలు నాగ గోపేశ్వరావుకు అభినందనలు తెలిపారు.

Similar News

News November 6, 2025

రోగులకు మెరుగైన వైద్యం అందించాలి: పెద్దపల్లి కలెక్టర్

image

పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష వైద్యారోగ్య శాఖపై గురువారం సమీక్ష సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా రోగులకు ఉత్తమ సేవలు అందించాలని సూచించారు. ఆసుపత్రుల పరిశుభ్రత, పారిశుద్ధ్య సిబ్బంది అందుబాటు, బీపీ-మధుమేహ రోగులకు అవగాహన కార్యక్రమాలు, కంటి పరీక్షలపై కార్యాచరణ సిద్ధం చేయాలని ఆదేశించారు. పీహెచ్‌సీ, సబ్ సెంటర్ భవనాలు త్వరగా పూర్తి చేయాలని, వైద్య సేవలను మరింత బలోపేతం చేయాలని సూచించారు.

News November 6, 2025

రామగుండం: ‘కోల్ ఇండియా స్థాయిలో రాణించాలి’

image

రామగుండం-3, అడ్రియాల ప్రాజెక్ట్ ఏరియాలో రామగిరి మండలంలోని రాణి రుద్రమదేవి క్రీడా ప్రాంగణంలో గురువారం RG-3, ఏపీఏ, భూపాలపల్లి ఏరియాల మధ్య రీజినల్ స్థాయి హాకీ పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమాన్ని ఎస్వోటుజీఎం ఎం.రామ్మోహన్ ప్రారంభించి, సింగరేణి ఉద్యోగులు క్రీడలలో ప్రతిభ కనబరిచి కోల్ ఇండియా స్థాయిలో సంస్థకు గౌరవం తీసుకురావాలని సూచించారు. అధికారులు, సంఘం సభ్యులు, క్రీడాకారులు పాల్గొన్నారు.

News November 6, 2025

‘గూగుల్ సెంటర్‌తో వందల సంఖ్యలోనే ఉద్యోగాలొస్తాయి’

image

విశాఖలో గూగుల్ సెంటర్ ఏర్పాటు చేస్తే లక్షల్లో ఉద్యోగాలు రావని, వందల సంఖ్యలో మాత్రమే ఉద్యోగాల కల్పన సాధ్యమవుతుందని కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు చింత మోహన్ అన్నారు. సుందర్ పిచాయ్ పేదవాడు కాదని అపర కోటీశ్వరుడన్నారు. 500 ఎకరాలు ఇచ్చి భూములతో వ్యాపారం చేయడం చంద్రబాబుకు పిచాయ్‌కి మధ్య ఉన్న బంధం ఏంటో వెల్లడించాలన్నారు. ఈనెల 31లోపు స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ కాదని కేంద్రం ప్రకటన చేయలన్నారు.