News August 27, 2025
నంద్యాల: అంతర్రాష్ట్ర దోపిడీ దొంగల ముఠా అరెస్ట్

నంద్యాల, కర్నూలు, ప్రకాశం తదితర జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో జరిగిన దోపిడీ, దొంగతనాల కేసులలో దొంగలను అరెస్టు చేసినట్లు ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా తెలిపారు. బండి ఆత్మకూరు, పాణ్యం, గడివేముల మండలాలకు చెందిన నలుగురిని అరెస్ట్ చేశామన్నారు. వారి వద్ద నుంచి 11 తులాల బంగారు, 21 తులాల వెండి నగలు, రూ.10,100 నగదు, 2 బైకులు, 4 పిడిబాకులు, 2 కత్తులను స్వాధీనం చేసుకున్నామన్నారు.
Similar News
News August 27, 2025
జాతీయ అవార్డుకు ఎంపికైన జనగామ కవయిత్రి

తెలుగు భాష పితామహుడు గిడుగు రామ్మూర్తి జయంతి సందర్భంగా ఈనెల 31న ఆంధ్రప్రదేశ్ పల్నాడులో తెలుగు తేజం జాతీయ పురస్కారాలు అందజేయనున్నారు. ఈ క్రమంలో జనగామకు చెందిన ప్రముఖ కవయిత్రి బుదారపు లావణ్య ఎంపికైనట్లు నిర్వాహక సంస్థ అంతర్జాతీయ శ్రీశ్రీ కళావేదిక నిర్వహకులు తెలిపారు. జాతీయ స్థాయిలో తెలుగు కవులు కవయిత్రులను ఈ పురస్కారానికి ఎంపిక చేసినట్లు తెలిపారు.
News August 27, 2025
టిష్యూ, యాపిల్స్‌తో వినాయకులు.. చూశారా?

వినాయక విగ్రహాల తయారీలో పలువురు తమలోని సృజనాత్మకతను చాటుకుంటున్నారు. ఒడిశాలోని సంబల్‌పుర్‌లో 1,500 కేజీల యాపిల్స్‌తో 28 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకు పండ్లతో గణేషుడిని రూపొందించినట్లు నిర్వాహకులు తెలిపారు. గుజరాత్‌లోని సూరత్‌లో టిష్యూ పేపర్లతో పర్యావరణహిత విగ్రహాన్ని తయారు చేశారు. 350 కేజీల టిష్యూతో 16 అడుగుల ఎత్తులో రూపొందించిన ఈ విగ్రహం ఆకట్టుకుంటోంది.
News August 27, 2025
వరంగల్: WOW.. కనురెప్పపై సూక్ష్మ గణపతి

వరంగల్ నగరానికి చెందిన సూక్ష్మ కళాకారుడు మట్టేవాడ అజయ్ కుమార్ కనురెప్పపై సూక్ష్మ గణపతిని రూపొందించారు. వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని 120 గంటల పాటు శ్రమించి 0.37మి.మీ ఎత్తులో గణనాథున్ని తయారుచేశారు. అజయ్ కుమార్ అనేక సూక్ష్మ కళాఖండాలను రూపొందించి అనేక అవార్డులు సాధించారు. ప్రత్యేకమైన సూక్ష్మ కళారూపాలను రూపొందిస్తూ అయన ప్రముఖుల ప్రశంసలు పొందుతున్నారు.