News September 1, 2025

నంద్యాల: ‘ఆ గ్రామంలో 22 ఏళ్ల నుంచి గణేశ్ ఉత్సవాలు లేవు’

image

నంద్యాల(D) ప్యాపిలిలో 22 ఏళ్లుగా గణేశ్ ఉత్సవాలకు గ్రామస్థులు దూరంగా ఉంటున్నారు. 2003 SEP 2న గ్రామంలోని SC కాలనీలో ప్రతిష్ఠించిన విగ్రహాన్ని పురవీధుల గుండా ఊరేగిస్తుండగా అగ్రకులాల వారు అడ్డుకున్నారు. పెద్దఎత్తున ఘర్షణ జరిగి ఇరువర్గాల వారు రాళ్లతో దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో 187 మందిపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదయింది. అప్పటి నుంచి మండపాలలో వినాయకుడిని ప్రతిష్ఠించకుండా ఇళ్లలోనే ఉత్సవాలు చేస్తున్నారు.

Similar News

News September 4, 2025

జగిత్యాల దిశా కమిటీ మెంబర్‌గా భూక్య నాయక్

image

రాయికల్ మండలం ధావన్‌పల్లి వాసికి దిశా కమిటీలో చోటు దక్కింది. ధావన్‌పల్లికి చెందిన బిక్య నాయక్‌ను జగిత్యాల దిశా కమిటీ మెంబర్‌గా బుధవారం ఎంపీ ధర్మపురి అరవింద్ నియమించారు. తన నియామకానికి సహకరించిన రాష్ట్ర నాయకులు మోరపెల్లి సత్యనారాయణ, జిల్లా అధ్యక్షులు డా. యాదగిరి బాబు, మండల అధ్యక్షులు ఆకుల మహేష్‌కు భూక్య నాయక్ కృతజ్ఞతలు తెలిపారు.

News September 4, 2025

వీటిపై త్వరలో 40శాతం జీఎస్టీ!

image

లగ్జరీ వస్తువులపై త్వరలో 40 శాతం పన్ను విధిస్తామని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. పాన్‌మసాలా, సిగరెట్, గుట్కా, పొగాకు ఉత్పత్తులపై ఈ మేరకు జీఎస్టీ వసూలు చేస్తామని తెలిపారు. ఫ్రూట్ జ్యూస్ కాకుండా నాన్ ఆల్కహాలిక్ బేవరేజెస్‌పై 40శాతం పన్ను ఉంటుందని పేర్కొన్నారు. వీటిపై ఇప్పటి వరకు ఉన్న 28శాతం శ్లాబులే కొనసాగనుండగా, త్వరలో 40 శాతం అమలు చేస్తామన్నారు.

News September 4, 2025

WGL: నిమజ్జనం సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు

image

వినాయక నిమజ్జనం సందర్భంగా వరంగల్, హనుమకొండ, కాజీపేట ట్రై-సిటీ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ తెలిపారు. శోభాయాత్ర, విగ్రహాల నిమజ్జనానికి ఎలాంటి అంతరాయం కలగకుండా ఈ ఆంక్షలు విధించారు. ఈ ట్రాఫిక్ ఆంక్షలు గురువారం ఉదయం నుండి సెప్టెంబర్ 7వ తేదీ ఉదయం 6 గంటల వరకు కొనసాగుతాయని ఆయన వెల్లడించారు. వాహనదారులు సహకరించాలని సీపీ కోరారు.