News January 28, 2025
నంద్యాల: ఇంట్లో సిలిండర్ పేలి ఇద్దరి మృతి!

నంద్యాల జిల్లాలో విషాద ఘటన జరిగింది. చాపిరేవులలో ఓ ఇంట్లో సిలిండర్ పేలింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా, మరో 8 మంది తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. మృతులు దినేశ్ (10), సుబ్బమ్మ (60)గా గుర్తించారు. క్షతగాత్రులను నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వంట చేస్తుండగా సిలిండర్ పేలి ఈ ఘటన జరిగింది.
Similar News
News November 7, 2025
రాజమౌళి చిత్రం నుంచి బిగ్ అప్డేట్

రాజమౌళి-మహేశ్ బాబు కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న మూవీ(SSMB29) నుంచి బిగ్ అప్డేట్ వచ్చింది. ఈ చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమారన్ లుక్‌ను జక్కన్న సోషల్ మీడియాలో విడుదల చేశారు. ‘‘పృథ్వీతో మొదటి షాట్ పూర్తవగానే అతని దగ్గరికి వెళ్లి నాకు తెలిసిన అత్యుత్తమ నటుల్లో మీరు ఒకరు అని చెప్పాను. శక్తిమంతమైన, క్రూరమైన విరోధి ‘కుంభ’(పృథ్వీ క్యారెక్టర్ పేరు)కు ప్రాణం పోయడం సంతృప్తికరం’’ అని రాసుకొచ్చారు.
News November 7, 2025
డిజిటల్ సేవలపై అవగాహన కల్పించాలి: కలెక్టర్

తూ.గో. జిల్లా వ్యాప్తంగా ‘మన మిత్ర’ వాట్సాప్ ఆధారిత సేవలపై శుక్రవారం నుంచి డోర్ టు డోర్ అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి తెలియజేశారు. గ్రామ/వార్డు సచివాలయాల సిబ్బంది ఇంటింటికీ వెళ్లి వాట్సాప్ సేవల డెమో, క్యూఆర్ కోడ్ పంపిణీ, పాంప్లెట్లు ఇవ్వాలని ఆమె ఆదేశించారు. ప్రతి ఇంటిని కవర్ చేసి, నమోదు అయిన కుటుంబాల వివరాలను రికార్డు చేయాలని కలెక్టర్ సూచించారు.
News November 7, 2025
రాజన్న ఆలయం పడమరవైపు గేటు మూసివేత

వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి దేవస్థానం పడమరవైపు గేటును మూసివేశారు. ఆలయ అభివృద్ధి నేపథ్యంలో రాజన్న ఆలయంలో సాధారణ దర్శనాలు కొనసాగిస్తున్న అధికారులు అన్నిరకాల ఆర్జిత సేవలను భీమేశ్వరాలయానికి మార్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పడమరవైపు స్వాగత ద్వారానికి అడ్డంగా రేకులను అమర్చారు. పీఆర్‌ఓ కార్యాలయ మార్గం నుంచి ఆలయంలోపలికి వెళ్లకుండా అక్కడ కూడా రేకులను అడ్డుగాపెట్టి రాకపోకలను నిలిపివేశారు.


