News January 11, 2026
నంద్యాల: ఈనెల 14న జిల్లాస్థాయి కబడ్డీ పోటీలు

గడివేముల మండలం చిందుకూరులో సంక్రాంతి పండగ సందర్భంగా ఈ నెల 14న జిల్లాస్థాయి కబడ్డీ పోటీలను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు ఆదివారం తెలిపారు. గెలుపొందిన టీములకు మొదటి బహుమతి రూ.20,000లు, రెండో బహుమతి రూ.15,000లు, మూడో బహుమతి రూ.10,000లు, నాలుగో బహుమతి రూ.7,000లు, ఐదో బహుమతిగా రూ.5,000లు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.
Similar News
News February 13, 2026
సిరిసిల్లలో BRS విజయం, ధర్మపురిలో కాంగ్రెస్ క్లీన్‌స్వీప్

TG: BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్లలో BRS విజయం సాధించింది. ఆ మున్సిపాలిటీలో 39 వార్డులు ఉండగా 27 చోట్ల BRS గెలిచింది. కాంగ్రెస్ 6, బీజేపీ 5, ఇతరులు 1 వార్డు సొంతం చేసుకున్నారు. అటు జగిత్యాల జిల్లా ధర్మపురి మున్సిపాలిటీలో మొత్తం 15 వార్డులు గెలుచుకుని కాంగ్రెస్ క్లీన్‌స్వీప్ చేసింది.
News February 13, 2026
BREAKING: మిర్యాలగూడ మున్సిపల్ పీఠం కాంగ్రెస్‌దే

మిర్యాలగూడ మున్సిపాలిటీ పీఠం కాంగ్రెస్ గెలిచింది. ఇక్కడ 48 వార్డులకు గాను 31 వార్డులు కాంగ్రెస్ సాధించింది. 14 వార్డులు BRS, 1వార్డు బీజేపీ, 2 వార్డులు ఇతరులు గెలిచారు. మ్యాజిక్ ఫిగర్ దాటడంతో కాంగ్రెస్ పీఠం దక్కించుకుంది. దీంతో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి.
News February 13, 2026
కొత్తగూడెంలో మందకొడిగా ఓట్ల లెక్కింపు

కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాల వెల్లడిలో తీవ్ర జాప్యం నెలకొంది. మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమైన ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఆశించిన స్థాయిలో వేగంగా సాగడం లేదు. సాంకేతిక కారణాలు, సిబ్బంది కొరతతో రౌండ్ల వారీ ఫలితాల వెల్లడి ఆలస్యమవుతోంది. దీంతో అభ్యర్థులు, వారి అనుచరుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కౌంటింగ్ కేంద్రం వద్ద భారీగా మోహరించిన కార్యకర్తలు ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు.


