News March 29, 2025

నంద్యాల: ఉగాది సందర్భంగా ప్రత్యేక రైళ్లు

image

ఉగాది సందర్భంగా నంద్యాల మీదుగా రెండు రైళ్ల ను దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ప్రయాణీకుల రద్దీని దృష్టిలో ఉంచుకుని గుంటూరు-హుబ్లీ మధ్య ఈ రైళ్లను ఏర్పాటు చేశారు. ఈనెల 31న రాత్రి 8 గంటలకు గుంటూరు నుంచి హుబ్లీకి బయలుదేరే రైలు(07271) నంద్యాలకు రాత్రి 12:50 గంటలకు చేరనుంది. అలాగే వచ్చే నెల 1న ఉదయం 11 గంటలకు హుబ్లీ నుంచి గుంటూరుకు బయలుదేరే రైలు(07272) నంద్యాలకు రాత్రి 7:50 గంటలకు చేరనుంది.

Similar News

News April 1, 2025

CBSE సిలబస్‌లో కీలక మార్పులు

image

సీబీఎస్‌ఈ 10 నుంచి 12 తరగతుల సిలబస్‌లో కీలక మార్పులు చేసింది. 2025-26 అకడమిక్ ఇయర్ నుంచి అన్ని అనుబంధ స్కూల్స్‌లో అప్డేటెడ్ సిలబస్ అందుబాటులోకి రానుంది. విద్యార్థులను భవిష్యత్ అవసరాలకు తగినట్లు సిద్ధం చేయడం, మరింత క్రియాశీల వాతావరణం కల్పించడమే లక్ష్యంగా మార్పులు చేసినట్లు బోర్డు పేర్కొంది. వినూత్న పద్ధతిలో బోధించాలని, గైడ్‌లైన్స్ పకడ్బందీగా అమలు చేయాలని స్కూళ్లకు ఆదేశాలు జారీ చేసింది.

News April 1, 2025

పాడేరు: కాంట్రాక్టు పద్ధతిలో పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

image

జిల్లా మహిళా శిశు సంక్షేమ సాధికారత పరిధిలోని వన్ స్టాప్ సెంటర్, మిషన్ వాత్సల్యలో కాంట్రాక్టు పద్ధతిలో పని చేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ దినేష్ కుమార్ మంగళవారం తెలిపారు. సోషల్ కౌన్సిలర్, మల్టీపర్పస్ స్టాఫ్, సెక్యూరిటీ గార్డు, మేనేజర్, డాక్టర్ తదితర పోస్టులకు ఈనెల 2 నుంచి 16వ తేదీలోగా జిల్లా మహిళా శిశు సంక్షేమ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలన్నారు.

News April 1, 2025

రేపటి నుంచి క్రయవిక్రయాలు ప్రారంభం..!

image

ఖమ్మం వ్యవసాయ మార్కెట్ బుధవారం పునః ప్రారంభం కానున్నదని మార్కెట్ శాఖ అధికారులు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. వారాంతపు సెలవు, ఉగాది, రంజాన్ సెలవుల అనంతరం రేపటి నుంచి మార్కెట్లో క్రయవిక్రయాలు పునః ప్రారంభం అవుతాయని చెప్పారు. కావున ఈ విషయాన్ని జిల్లా రైతు సోదరులు గమనించి తమ పంటను వ్యవసాయ మార్కెట్ కు తీసుకొని అమ్మకాలు జరుపుకోవాలని పేర్కొన్నారు.

error: Content is protected !!