News November 7, 2025
నంద్యాల: ఉచితంగా స్కూటీలు

దివ్యాంగుల సంక్షేమానికి CM చంద్రబాబు కృషి చేస్తున్నారని ప్రభుత్వ టెలికాం అడ్వైజరి కమిటీ మెంబర్ రమేశ్ పేర్కొన్నారు. గురువారం పాములపాడులో మీడియాతో ఆయన మాట్లాడారు. దివ్యాంగులకు ఉచితంగా రెట్రో పిట్టెడ్ మోటార్ సైకిల్స్‌ను సీఎం ఉచితంగా అందజేస్తున్నారన్నారు. అర్హులైన దివ్యాంగులు ఈనెల 25వ తేదీ లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు www.apdascac.ap.gov.in వెబ్సైట్‌ను సంప్రదించాలన్నారు.
Similar News
News November 7, 2025
దర్శకుడిగా మన సిక్కోలు వాసి..!

మన శ్రీకాకుళం కుర్రాడు రాహుల్ దర్శకుడిగా ప్రపంచానికి పరిచయం కానున్నాడు. సినిమాలపై మక్కువ, దర్శకుడు కావాలనే ఆసక్తితో చదువుతూనే మూవీ మేకింగ్ అంశాలను తెలుసుకున్నాడు. తొలుత వెబ్ సిరీస్‌లకు దర్శకత్వం, సహాయ దర్శకుడిగా పదేళ్లు పని చేశాడు.‘ది గ్రేట్ ఫ్రీ వెడ్డింగ్ షో’(కామెడీ జోనర్) మూవీకి డైరెక్షన్ వహించగా, ఆ చిత్రం నేడు ప్రపంచ వ్యాప్తంగా 200 థియేటర్లలో విడుదలవుతోంది.
News November 7, 2025
కడప: వేలంలోకి శ్రీచరణి

మన కడప అమ్మాయి నల్లపురెడ్డి శ్రీచరణి వుమెన్స్ వరల్డ్‌కప్‌లో సత్తాచాటిన విషయం తెలిసిందే. కప్ గెలవడంలో తనవంతు పాత్ర పోషించింది. అయినప్పటికీ WPLలో ఆమెను ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు రిటైన్ చేసుకోలేదు. దీంతో త్వరలో జరగనున్న WPL-2026 వేలంలోకి శ్రీచరణి రానుంది. గత సీజన్‌లో ఆమెకు ఢిల్లీ జట్టు రూ.55 లక్షలు చెల్లించగా.. వేలంలో రూ.కోట్లలో ధర దక్కే అవకాశం ఉందని పలువురు అంచనా వేస్తున్నారు.
News November 7, 2025
మెదక్: శ్మశానంలో దొంగలు.!

కీచురాళ్లు.. శవాలను తింటాయని చదివాం.. కానీ శ్మశానంలో దొంగల బెడద ఉందంటే నమ్ముతారా? అవును మీరు చదివింది నిజమే. మెదక్ జిల్లాలోని చేగుంటలోని వైకుంఠ ధామంలో కాలుతున్న శవాల బూడిద, పుర్రెలు, ఎముకలను దుండగులు ఎత్తుకెళ్తున్నారు. గడిచిన 15 రోజుల్లో మూడు ఘటనలు చోటు చేసుకున్నాయి. బూడిదతో పాటు పుర్రెలను ఎత్తు కెళ్లటంతో వాటితో క్షుద్రపూజలు చేస్తున్నారా? అంటూ ప్రజలు భయపడుతున్నారు.


