News May 21, 2024

నంద్యాల: ఓ వైపు విష్ణు స్వరూపం.. మరోవైపు శివుడిగా దర్శనం

image

ఆత్మకూరు మండలం నల్వకాల్వ గ్రామసమీపంలో వెలసిన లక్ష్మీనరసింహస్వామి జయంతి వేడుకలు బుధవారం నిర్వహించనున్నారు. ఈ ఆలయంలో స్వామిఅమ్మవారు పాణిపట్టంపై కొలువుదీరి ముందు భాగంలో విష్ణుస్వరూపంగా వెనుక భాగంలో శివలింగ ఆకారంలో దర్శనమిస్తారు. ఈ ఆలయ మరో ప్రత్యేకత ఏమిటంటే ఉత్తరాయాణంలో పుష్యమాసం నుంచి ఆషాడమాసం వరకు ఉదయం సూర్యకిరణాలు స్వామిఅమ్మవార్లపై ప్రసరించడంతో గర్భాలయ గోడలపై నీడ లింగకారంలో ప్రతిబింబిస్తుంది.

Similar News

News November 5, 2025

ప్రభుత్వ ఆసుపత్రిలో సమస్యలు త్వరగా పరిష్కరిస్తాం: కలెక్టర్

image

కర్నూలు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి, మెడికల్ కాలేజీ సమస్యలను త్వరగా పరిష్కరిస్తామని కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి తెలిపారు. బుధవారం సాయంత్రం మెడికల్ కాలేజీ సమావేశ మందిరంలో అన్ని వైద్య విభాగాల అధికారులతో ఆమె సమావేశం నిర్వహించారు. వైద్య పరికరాలు, సిబ్బంది నియామకాలు, వసతుల మెరుగుదల కోసం చర్యలు తీసుకుంటామన్నారు. మంత్రి టీజీ భరత్ సహకారంతో సమస్యలను పరిష్కరిస్తామని కలెక్టర్ తెలిపారు.

News November 5, 2025

కర్నూలు జిల్లాలో SIల బదిలీలు: SP

image

కర్నూలు జిల్లాలో SIల బదిలీలు చేపట్టినట్లు ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. మంగళవారం బదిలీల ఉత్తర్వులు జారీ చేశారు. గూడూరు SI అశోక్‌‌ను కర్నూలు తాలూకా PSకు, SI ఎం.తిమ్మయ్యను కర్నూలు 3 టౌన్‌ నుంచి కర్నూలు 2 టౌన్‌కు, SI జి.హనుమంత రెడ్డిని 2 టౌన్‌ నుంచి గూడూరుకు, SI ఏసీ పీరయ్యను కర్నూలు తాలూకా PS నుంచి కర్నూలు 3 టౌన్‌కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

News November 5, 2025

కర్నూలు కలెక్టరే టీచర్

image

కర్నూలు కలెక్టర్ ఏ.సిరి మంగళవారం కోడుమూరులోని మహిళా సాంఘిక సంక్షేమ హాస్టల్‌ను సందర్శించారు. విద్యార్థినుల మధ్య ఉపాధ్యాయురాలిగా కూర్చుని, వారికి విద్యపై మార్గదర్శకత్వం అందించారు. చదువులో మెళకువలు, సమయపాలన ప్రాముఖ్యత గురించి వివరించారు. కష్టపడి చదివి తల్లిదండ్రులకు, సమాజానికి మంచి పేరు తెచ్చుకోవాలని ప్రోత్సహించారు. హాస్టల్‌లో ఎలాంటి సమస్యలు ఎదురైనా వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు.