News March 17, 2025

నంద్యాల కలెక్టరేట్‌కు 209 అర్జీల రాక

image

నంద్యాల కలెక్టరేట్‌లో గ్రీవెన్స్ డే జరిగింది. జిల్లా నలుమూలాల నుంచి ప్రజలు తరలి వచ్చి తమ సమస్యలను అధికారులకు వివరించారు. మొత్తంగా 209 ఫిర్యాదులు వచ్చాయి. కలెక్టర్ రాజకుమారి, జాయింట్ కలెక్టర్ సి.విష్ణుచరణ్, డీఆర్ రామునాయక్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, జిల్లా అధికారులు అర్జీలు స్వీకరించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఇప్పటివరకు పరిష్కరించిన 27,854 ఫిర్యాదుదారుల నుంచి అభిప్రాయాలు సేకరించాలన్నారు. 

Similar News

News November 6, 2025

జగిత్యాల: రాయికల్‌లో కానిస్టేబుల్‌పై దాడికి యత్నం

image

రాయికల్ మండలం కుమ్మరిపల్లికి చెందిన దొంతి సాయి(23), గంజాయి కేసులో పరారీలో ఉండగా రాయికల్ బస్టాండ్ వద్ద కానిస్టేబుల్ వెంకటేశ్ అతడిని పట్టుకున్నాడు. స్టేషన్‌కు తీసుకెళ్తుండగా సాయి బండిని వేగంగా నడుపుతూ కానిస్టేబుల్‌ను కిందపడేసి పారిపోవడానికి ప్రయత్నించాడు. గాయాలతోనూ అతడిని తిరిగి పట్టుకున్నాడు. ఈ సమయంలో సాయి తండ్రి మురళి, అన్న నాగరాజు అడ్డుపడడంతో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపారు.

News November 6, 2025

దురుద్దేశంతోనే నాపై స్టాలిన్ ఆరోపణలు: విజయ్

image

కరూర్(TN) తొక్కిసలాటపై CM స్టాలిన్ అసెంబ్లీలో తనపై ద్వేషంతోనే ఆరోపణలు చేశారని TVK చీఫ్ విజయ్ విమర్శించారు. బాధితుల్ని ఆదుకున్నా రాజకీయ, ప్రభుత్వ, మీడియా విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చిందన్నారు. దీంతోనే నిష్పాక్షిక విచారణ జరగదని సుప్రీం గుర్తించిందని చెప్పారు. ఎన్నికల్లో DMK, TVK మధ్యే పోటీ అని స్పష్టంచేశారు. తొక్కిసలాట తర్వాత తొలిసారి భేటీ అయిన TVK కౌన్సిల్ CM అభ్యర్థిగా విజయ్‌ను డిక్లేర్ చేసింది.

News November 6, 2025

HYD: 3 నెలలైనా ఎందుకు పట్టించుకోవడం లేదు: సీఎం

image

బీఆర్ఎస్ సహకరించకపోతే మోదీ ప్రధాని అయ్యేవారు కాదని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. బీజేపీ, బీఆర్ఎస్ పేరుతో జూబ్లీహిల్స్‌లో ఓట్లు అడుగుతున్నారని ఆరోపించారు. కాళేశ్వరంపై సీబీఐ విచారణ కోరితే KCRకు 24 గంటల్లో చిప్పకూడు తినిపిస్తానన్న MP కిషన్ రెడ్డి, విచారణకు ఆదేశించి 3 నెలలైనా ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. జూబ్లీహిల్స్‌లో నవీన్ యాదవ్ 30 వేల మెజారిటీతో గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు.