News March 10, 2025

నంద్యాల కలెక్టరేట్‌లో నేడు ప్రజా వినతుల స్వీకరణ

image

నంద్యాల పట్టణం కలెక్టరేట్‌లోని పీజీఆర్ఎస్ హాలులో సోమవారం “ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక” కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి వినతులు స్వీకరించనున్నట్లు కలెక్టర్‌ రాజకుమారి గణియా ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే జిల్లా కేంద్రంతో పాటు మండల, నియోజకవర్గ, డివిజన్ స్థాయిలో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.

Similar News

News July 9, 2025

కరీంనగర్: ‘తక్షణమే హార్డ్ కాపీలు పంపాలి’

image

కరీంనంగర్ జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల e-pass లాగిన్లలో పెండింగ్‌లో ఉన్న యుటిలైజేషన్ సర్టిఫికెట్లు తాజా, పునరుద్ధరణ ఉపకారవేతన దరఖాస్తులను (Fresh/Renewal Scholarship Applications) తక్షణమే వెరిఫై చేయాలని DTDO సంగీత ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వాటి హార్డ్ కాపీలను జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి కార్యాలయానికి తక్షణమే సమర్పించలన్నారు. సందేహాల నివృత్తికి 9502664044కు కాల్ చేయాలని కోరారు.

News July 9, 2025

ద్వారకానగర్: పిల్లలకు సెలవు.. పేరెంట్స్‌ వెళితే గేట్లకు సీల్

image

ద్వారకానగర్‌లోని రవీంద్ర భారతీ స్కూల్ 3 రోజులుగా తెరవలేదు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చేపట్టగా అసలు నిజం బయటపడింది. సిబ్బందికి ESI కల్పించకపోవడంతో అధికారులు నోటీసులు జారీ చేశారు. వీటికి స్పందన లేకపోవడంతో స్కూల్‌కు సీల్ వేశారు. దీన్ని కప్పిపుచ్చుకునేందుకే మేనేజ్‌మెంట్ పిల్లలకు సెలవు ప్రకటించిందని తల్లిదండ్రులు పేర్కొన్నారు. విషయం తెలుసుకున్న DEO ప్రేమ్ కుమార్ ESI అధికారులతో మాట్లాడారు.

News July 9, 2025

మాతృభూమికి సేవ చేయడం అభినందనీయం: కలెక్టర్

image

జన్మభూమికి సేవ చేయాలనే సంకల్పంతో పలు సంస్థలు, వ్యక్తులు ముందుకు వస్తున్నారని జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ తెలిపారు. మూడేళ్లుగా వేలాది మందికి శిక్షణ ఇచ్చి, ఉపాధి కల్పించేందుకు వారు కృషి చేస్తున్నారన్నారు. సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్, ఐటీ శిక్షణ తరగతులు ఏర్పాటు చేసి సేవా దృక్పథాన్ని చాటుకుంటున్నారని పేర్కొన్నారు. యూఎస్ఏకు చెందిన చిక్కాల విద్యాసాగర్ ముందున్నారని కలెక్టర్ ప్రశంసించారు.