News November 3, 2024
నంద్యాల: కారు ఢీకొని వ్యక్తి మృతి
గోస్పాడు మండలం దీబగుంట్ల గ్రామం సర్వీస్ రోడ్డు వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. అయ్యలూరులోని ఓ మసీదులో ఇమామ్‌గా పని చేస్తున్న జిల్లెల్ల గ్రామానికి చెందిన ముల్లా మహమ్మద్ హుస్సేన్(38) మధ్యాహ్నం సిరివెళ్ల నుంచి స్కూటీపై అయ్యలూరు వస్తుండగా వెనుక వైపు నుంచి కారు ఢీకొంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News January 13, 2025
BREAKING: నంద్యాల ఏఎస్పీగా మందా జావళి
2021-22 బ్యాచ్‌కు చెందిన ఐదుగురు ఐపీఎస్ అధికారులకు పోస్టింగ్ ఇస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా నంద్యాల జిల్లా ఏఎస్పీగా మందా జావళి ఆల్ఫోన్ నియమితులయ్యారు. విజయనగరం జిల్లాలో ట్రైనీ IPSగా మందా జావళి శిక్షణ పూర్తి చేసుకున్నారు. దీంతో త్వరలో ఆమె బాధ్యతలు స్వీకరించనున్నారు. కాగా మరోవైపు నంద్యాల జిల్లా అడిషనల్ ఎస్పీ(అడ్మిన్)గా యుగంధర్ బాబు విధులు నిర్వర్తిస్తున్నారు.
News January 13, 2025
ప్రజలకు నంద్యాల జిల్లా ఎస్పీ సూచనలు
సంక్రాంతి పండుగ జిల్లా ప్రజలందరి జీవితాలలో నూతన కాంతులు, సంతోషాలు నింపాలని నంద్యాల జిల్లా ఎస్పీ ఆదిరాజ్ సింగ్ రాణా ఆకాంక్షించారు. తెలుగు సంస్కృతి, సంప్రదాయాల మేళవింపుతో సంతోషంగా సంక్రాంతి పండుగను నిర్వహించుకోవాలన్నారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాల జోలికి వెళితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. భోగి, మకరసంక్రాంతి, కనుమ పండుగలను ఆనందంగా జరుపుకోవాలని ఎస్పీ ఆకాంక్షించారు.
News January 13, 2025
ఆళ్లగడ్డ సచివాలయ ఉద్యోగికి డాక్టరేట్
ఆళ్లగడ్డలో వార్డు సచివాలయ వెల్ఫేర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న చాగలమర్రికి చెందిన డా.మౌలాలి డాక్టరేట్ పొందారు. అర్థశాస్త్ర విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎన్.గణేశ్ నాయక్ పర్యవేక్షణలో ‘ఏ స్టడీ ఆఫ్ లేబర్ వెల్ఫేర్ ప్రాక్టీసెస్ ఇన్ సెలెక్టెడ్ ఇండస్ట్రీస్ ఆఫ్ కర్నూల్ డిస్త్రీక్ట్’ అనే అంశంపై పరిశోధన చేశారు. వైవీయూ పరీక్షల నిర్వహణ అధికారి ఆచార్య కేఎస్‌వీ కృష్ణారావు డాక్టరేట్‌ను జారీ చేశారు.