News December 27, 2025
నంద్యాల: గంధం చంద్రుడుకు కార్యదర్శిగా పదోన్నతి

NDL: రాష్ట్రంలో ఐదుగురు కలెక్టర్లకు ప్రభుత్వం పదోన్నతి కల్పించింది. ఈ మేరకు ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం కోటపాడుకు చెందిన కలెక్టర్ గంధం చంద్రుడుకు (2010 బ్యాచ్) కార్యదర్శిగా పదోన్నతి లభించింది. కాగా.. ప్రస్తుతం గంధం చంద్రుడు రాష్ట్ర కార్మిక శాఖ అదనపు కార్యదర్శి హోదాలో పనిచేస్తున్నారు.
Similar News
News December 31, 2025
MBNR: కురుమూర్తిలో నేడు గిరి ప్రదక్షిణ

అమ్మాపూర్ సమీపంలోని ప్రసిద్ధ కురుమూర్తి స్వామి క్షేత్రంలో బుధవారం ఉదయం 10:30 గంటలకు గిరి ప్రదక్షిణ నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఉమ్మడి జిల్లా నలుమూలల నుంచి భక్తులు భారీగా తరలివచ్చి వేడుకను విజయవంతం చేయాలని కోరారు. ‘పేదల తిరుపతి’గా వెలుగొందుతున్న స్వామివారి గిరి ప్రదక్షిణ కోసం అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకున్నారు.
News December 31, 2025
బహుమతులు వద్దు.. సేవలే ముద్దు: సత్యసాయి కలెక్టర్

న్యూ ఇయర్ సందర్భంగా పూలబొకేలు, శాలువాలు, కేకులు తీసుకురావద్దని సత్యసాయి జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ కోరారు. వీటి బదులు విద్యార్థులకు పుస్తకాలు, నిరుపేదలకు బెడ్‌షీట్లు, టీబీ రోగులకు పోషకాహార కిట్లు అందించాలని సూచించారు. సమాజంలోని అణగారిన వర్గాలకు సేవ చేయడమే నిజమైన శుభాకాంక్షలని పేర్కొన్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాల ద్వారానే సమాజానికి మేలు జరుగుతుందని కలెక్టర్ ప్రజలకు పిలుపునిచ్చారు.
News December 31, 2025
Crime Report: ‘నేరాల నియంత్రణలో గణనీయమైన పురోగతి’

సత్యసాయి జిల్లాలో 2025లో నేరాల నియంత్రణలో గణనీయమైన పురోగతి సాధించినట్లు SP సతీశ్ కుమార్ తెలిపారు. మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఆయన వార్షిక నివేదిక విడుదల చేశారు. జిల్లాలో మొత్తం నేరాల నమోదు 2 శాతం పెరిగినా, హత్యలు, కిడ్నాపులు, తీవ్రమైన నేరాలు తగ్గాయని వివరించారు. రోడ్డు ప్రమాద మరణాలు 11 శాతం తగ్గాయని, హిందూపురం బ్యాంకు దోపిడీ కేసును ఛేదించి రూ.5.5 కోట్ల బంగారం రికవరీ చేశామని పేర్కొన్నారు.


