News December 23, 2025

నంద్యాల-గుంతకల్లు మధ్య పగటి పూట రైలు

image

రైలు ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని గుంతకల్లు – నంద్యాల – మార్కాపురం మధ్య పగటి పూట రైలుకు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ఎంపీ డా.బైరెడ్డి శబరి తెలిపారు. ఇటీవల పార్లమెంట్‌లో ఆమె చేసిన విన్నపానికి స్పందిస్తూ కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. త్వరలో పట్టాలెక్కనున్న ఈ రైలు సౌకర్యాన్ని జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ రైలు (57407/08) త్వరలోనే పట్టాలెక్కనుంది.

Similar News

News December 23, 2025

NRPT: ‘క్లెయిమ్ చేసుకోనని ఆస్తులను సొంతం చేసుకోండి’

image

బ్యాంకులలో వివిధ కారణాలతో క్లెయిమ్ చేసుకోలేని ఆస్తులను తిరిగి సొంతం చేసుకునేందుకు “మీ సొమ్ము మీ హక్కు” కార్యక్రమం చేపట్టినట్లు ఇన్‌ఛార్జ్ కలెక్టర్ సంచిత్ గంగ్వార్ అన్నారు. మంగళవారం నారాయణపేట కలెక్టరేట్‌లో నిర్వహించిన అవగాహన సదస్సుకు ఆర్బీఐ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ రెహమాన్ హాజరయ్యారు. పలువురు ఖాతాదారులకు సొమ్మును అందిస్తున్నట్లు పత్రాలను అందించారు. మూడు నెలల పాటు కార్యక్రమం ఉంటుందన్నారు.

News December 23, 2025

పవన్ ఓ కాగితం పులి: బొత్స

image

AP: మెడికల్ కాలేజీలు ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉండాలన్నదే తమ విధానమని YCP నేత బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. ప్రైవేటీకరణ పేరిట అక్రమాలు చేసిన వారందరిపై చర్యలు తప్పవన్నారు. పవన్ కాగితం పులి అని, సినిమా డైలాగ్‌లు, పీకుడు భాష కట్టిపెట్టాలన్నారు. ‘కోటి సంతకాలు ఎవరు పెట్టారని మంత్రి సత్యకుమార్ అంటున్నారు. మీ గ్రామానికి వెళ్లి ప్రైవేటీకరణకు అభ్యంతరముందా అని అడిగితే వాస్తవాలు తెలుస్తాయి’ అని సూచించారు.

News December 23, 2025

కోస్గి: 750 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు

image

సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకు 750 మంది పోలీసులతో పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ డాక్టర్ వినీత్ అన్నారు. సీఎం బందోబస్తుకు వచ్చిన పోలీసులతో మంగళవారం కోస్గి పట్టణంలోని ఓ ఫంక్షన్ హాలులో సమావేశం నిర్వహించారు. బందోబస్తును పది సెక్టార్లుగా విభజించి ఎస్పీ, డీఎస్పీలను ఇన్‌ఛార్జ్‌లుగా నియమించినట్లు చెప్పారు. పోలీసులకు అప్పగించిన విధులు సమర్థవంతంగా నిర్వహించాలని చెప్పారు.