News December 23, 2025
నంద్యాల గెలుపు.. ఆర్థిక సంస్కరణల పితామహుడిగా గుర్తింపు

దేశానికి ఒక ప్రధానిని, ఒక రాష్ట్రపతిని అందించిన అరుదైన ఘనత నంద్యాల నియోజకవర్గానికి ఉంది. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు వర్ధంతి సందర్భంగా మంగళవారం నంద్యాల వాసులు ఆయన సేవలను ఘనంగా స్మరించుకున్నారు. 1991లో నంద్యాల నుంచి ఎంపీగా గెలిచిన పీవీ, ఆ తర్వాత ప్రధానమంత్రిగా దేశ ఆర్థిక గమనాన్ని మార్చిన ‘ఆర్థిక సంస్కరణల పితామహుడి’గా నిలిచిపోయారు.
Similar News
News December 28, 2025
వరంగల్ జిల్లాలో పెరిగిన చికెన్ ధరలు

జిల్లాలో గత ఆదివారంతో పోలిస్తే నేడు చికెన్ ధరలు భారీగా పెరిగాయి. ఈరోజు చికెన్ విత్ స్కిన్ కేజీకి రూ.250 నుంచి రూ.270 పలకగా.. స్కిన్ లెస్ కేజీకి రూ.280 నుంచి రూ.300 ధర పలుకుతోంది. అలాగే లైవ్ కోడి రూ.170-రూ.180 ధర ఉంది. సిటీతో పోలిస్తే పల్లెటూరులో రూ.10-20 ధర వ్యత్యాసం ఉంది. ధరలు పెరగడంతో కొనుగోలు స్వల్పంగా తగ్గినట్లు వ్యాపారులు చెబుతున్నారు.
News December 28, 2025
విశాఖ కలెక్టరేట్‌లో ప్రతి సోమవారం రెవెన్యూ క్లీనిక్: కలెక్టర్

విశాఖ కలెక్టరేట్‌లో ప్రతి సోమవారం నిర్వహిస్తున్న పీజీఆర్ఎస్‌లో రెవెన్యూకు సంబంధించిన అర్జీల విషయమై రెవెన్యూ క్లీనిక్‌ను నిర్వహించనున్నారు. డిసెంబర్ 29వ తేదీ నుంచి ప్రతీ సోమవారం ఈ కార్యక్రమం ప్రత్యేకంగా చేపట్టనున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లాలో గల అందరు రెవెన్యూ డివిజినల్ అధికారులు, ఎమ్మార్వోలు పాల్గొననున్నారు. అర్జీదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ సూచించారు.
News December 28, 2025
పెద్దపులి కదలికలపై నిరంతర నిఘా: ఎస్పీ సంకీర్త్

పెద్దపులి కదలికలపై అటవీ శాఖ అధికారులతో సమన్వయం చేసుకుంటూ పోలీసు శాఖ నిరంతర నిఘా కొనసాగిస్తున్నట్లు ఎస్పీ సంకీర్త్ పేర్కొన్నారు. ప్రజలు ఎలాంటి అనుమానాస్పద కదలికలు గమనించిన వెంటనే పోలీస్ స్టేషన్‌కు లేదా అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు. ప్రజల భద్రతకు పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటామని, పరిస్థితి పూర్తిగా నియంత్రణలోకి వచ్చే వరకు అవసరమైన పోలీస్ బందోబస్తు కొనసాగిస్తామని ఎస్పీ తెలిపారు.


