News June 25, 2024
నంద్యాల: చిరుత పులి దాడిలో మహిళ మృతి

చిరుత పులి దాడిలో మహిళ మృతి చెందిన ఘటన మంగళవారం జరిగింది. మహానంది, సిరివెళ్ల మండలాల పరిధిలోని నల్లమల అడవి ప్రాంతంలో ఉన్న పచ్చళ్ల గ్రామానికి చెందిన మాజీ ఉపసర్పంచ్ షేక్ మెహరూన్ బి కట్టెల కోసం అటవీ ప్రాంతంలోకి వెళ్లగా ఆమెపై చిరుత పులి దాడి చేసింది. ఈ దాడిలో మృతి చెందిందని బంధువులు తెలిపారు. అటవీ శాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు.
Similar News
News October 3, 2025
జిల్లా అభివృద్ధికి నిధులు విడుదల: కలెక్టర్

జిల్లా అభివృద్ధికి నీతి ఆయోగ్ ద్వారా నిధులు విడుదలైనట్లు కలెక్టర్ ఏ.సిరి తెలిపారు. చిప్పగిరి ఆస్పిరేషనల్ బ్లాక్ అభివృద్ధికి రూ.1.50 కోట్లు కేటాయించారు. ఈ నిధుల్లో అంగన్వాడీల అభివృద్ధికి రూ.35 లక్షలు, గ్రామీణ నీటి సరఫరా పనులకు రూ.95 లక్షలు, పాఠశాలల అభివృద్ధికి రూ.20 లక్షలు ఉన్నాయని ఆమె పేర్కొన్నారు. నిర్దేశించిన కాల వ్యవధిలో అన్ని అభివృద్ధి పనులను పూర్తి చేస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు.
News October 3, 2025
ఈనెల 16న మోదీ పర్యటనను విజయవంతం చేయండి: కలెక్టర్

ఈనెల 16న ప్రధాని మోదీ జిల్లా పర్యటనను విజయవంతం చేయాలని కలెక్టర్ డా.సిరి అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్‌లో అధికారులు, పోలీసు ఉన్నతాధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. మోదీ పర్యటనలో ఎటువంటి లోపాలు లేకుండా చూడాలని కలెక్టర్ ఆదేశించారు. భద్రతా ఏర్పాట్లు, ప్రోటోకాల్, వేదిక, వసతి, ట్రాఫిక్ నియంత్రణ తదితర అంశాలపై కలెక్టర్ సమీక్షించారు.
News October 3, 2025
కర్రల సమరంలో ముగ్గురి మృతి.. స్పందించిన కర్నూలు ఎంపీ

కర్నూలు(D) హొళగుంద(M) దేవరగట్టులో జరిగిన మాళమల్లేశ్వర స్వామి బన్నీ ఉత్సవంలో ముగ్గురు భక్తులు మృతి చెందడంతో పాటు 100 మందికి పైగా గాయపడిన ఘటనపై కర్నూలు ఎంపీ నాగరాజు దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఘటనపై అధికారులతో మాట్లాడిన ఆయన.. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. స్వామి జైత్ర యాత్రలో భక్తులు మృతి చెందడం బాధాకరమన్నారు. ప్రభుత్వం తరఫున ఆదుకుంటామన్నారు.