News December 19, 2025

నంద్యాల జిల్లాకు చెందిన IAS అధికారికి కీలక బాధ్యతలు

image

అభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 5 జిల్లాలకు జిల్లా ఇంఛార్జ్‌లుగా సీనియర్ IAS అధికారులను నియమిస్తూ చీఫ్ సెక్రటరీ విజయానంద్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో భాగంగా శ్రీ సత్యసాయి జిల్లా ఇంఛార్జ్‌గా నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం కోటపాడుకు చెందిన సీనియర్ IAS అధికారి గంధం చంద్రుడును నియమించింది. ఈయన గతంలో ఉమ్మడి అనంతపురం జిల్లా కలెక్టర్‌గా పనిచేశారు.

Similar News

News December 19, 2025

పామాయిల్ సాగుపై రైతులను చైతన్య వంతులను చేయండి: కలెక్టర్

image

అధిక లాభాలు ఇచ్చే పామాయిల్ సాగుపై రైతుల్లో అవగాహన కల్పించాలని కలెక్టర్ డీకే బాలాజీ ప్రజాప్రతినిథులను కోరారు. శుక్రవారం జరిగిన డీఆర్సీ సమావేశంలో వ్యవసాయ శాఖపై జరిగిన చర్చలో ప్రత్యేకంగా పామాయిల్ సాగు వల్ల కలిగే లాభాలను కలెక్టర్ సమావేశానికి హాజరైన ప్రజా ప్రతినిథులకు వివరించారు. ప్రతి ఒక్క రైతు పామాయిల్ సాగుపై మరలేలా రైతులను ప్రోత్సహించాలన్నారు.

News December 19, 2025

నాబార్డ్‌లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

image

<>NABARD<<>> 17 స్పెషలిస్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హత గల అభ్యర్థులు నేటి నుంచి JAN 2వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి డిగ్రీ/PG (కామర్స్/మ్యాథ్స్/ఎకనామిక్స్/స్టాటిస్టిక్స్/ఫైనాన్స్), MBA/PGDBA/PGDM, CA/ICWA, ME, BCA, MCA ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.850, SC, ST, PwBDలకు రూ.150. వెబ్‌సైట్: www.nabard.org

News December 19, 2025

సెలబ్రిటీలకు ఈడీ షాక్

image

బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కేసులో సెలబ్రిటీలకు ఈడీ షాక్ ఇచ్చింది. యువరాజ్ సింగ్, రాబిన్ ఉతప్ప, సోనూ సూద్, ఊర్వశి రౌతేలా, నేహా శర్మలకు చెందిన రూ.7.93 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసింది. PMLA కేసు కింద ఈ చర్య తీసుకుంది. ఇప్పటివరకు ‘1xBet’పై దర్యాప్తులో భాగంగా ఈడీ రూ.19.07 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసింది.