News March 20, 2025
నంద్యాల జిల్లాకు భారీ వర్ష సూచన

నంద్యాల జిల్లాల్లో ఈనెల 23న చెదురుమదురుగా పిడుగులతో కూడిన తేలికపాటి-మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని గురువారం ఏపీ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ(APSDMA) గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. ప్రజలు చెట్ల కింద నిలబడరాదని సూచించింది. వ్యవసాయ కూలీలు పోలాల్లో అప్రమత్తంగా ఉండాలని కోరింది. కాగా మరోవైపు జిల్లాలో గత కొద్దిరోజులుగా ఎండలు దంచికొడుతున్న తరుణంలో వర్ష సూచన శుభవార్త అనే చెప్పవచ్చు.
Similar News
News March 21, 2025
అంగన్వాడీల్లో పిల్లలను సొంతపిల్లల్లా చూసుకోవాలి: అనిత రామచంద్రన్

అంగన్వాడి పిల్లలను కంటికి రెప్పలా కాపాడాల్సిన బాధ్యత మన అందరిపై ఉందని మహిళా శిశు సంక్షేమం దివ్యాంగ వయోవృద్ధుల శాఖ ప్రధాన కార్యదర్శి అనితా రామచంద్రన్ తెలిపారు. గురువారం వికారాబాద్ కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో అంగన్వాడీ కేంద్రాల నిర్వహణ, పిల్లల అంగవైకల్యం తదితర అంశాలపై సిడిపిఓలు, సూపర్ వైజర్లు సఖీ ఐసిపిఎస్ అధికారులు, సిబ్బందితో ప్రధాన కార్యదర్శి సమావేశం నిర్వహించారు.
News March 21, 2025
ఒంగోలు: పసికందు హత్య.. తండ్రికి యావజ్జీవ శిక్ష.!

భార్య పైన అనుమానంతో మూడేళ్ల పసికందును హత్య చేసిన కసాయి తండ్రి ఖాదర్‌కి ఒంగోలు ప్రిన్సిపల్ జిల్లా జడ్జి భారతి గురువారం యావజ్జీవ శిక్ష విధించారు. చీమకుర్తిలో భార్య సాల్మాతో కలిసి భర్త ఖాదర్ నివాసం ఉంటూ కూలి పనులకు వెళ్లేవాడు. ఏడేళ్ల క్రితం భార్యపై అనుమానంతో కుమారుడు సాహుల్ గొంతు కోసి హత్య చేశాడు. నింద రుజువైనందున ఎట్టకేలకు ఏడేళ్లకు అతనికి యావజ్జీవ శిక్షను కోర్టు విధించింది.
News March 21, 2025
తెలంగాణ ఊటీ.. అనంతగిరి అందాలను కాపాడుకుందాం

VKBకు 6 కి.మీ. దూరంలో ఉన్న ‘అనంతగిరి కొండలు’ ప్రకృతి అందాలకు నెలవు. దాదాపు 3,763 ఎకరాల విస్తీర్ణంలో అటవీ అబ్బుర పరుస్తోంది. అటవీ మధ్య 1300 ఏళ్ల చరిత్ర గల ‘అనంత పద్మనాభస్వామి ఆలయం’ అందరినీ ఆకర్షిస్తోంది. అనంతగిరిని ‘తెలంగాణ ఊటీ’ అంటారు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో పర్యాటకుల తాకిడి ఎక్కువ. ప్రస్తుతం ఈ అటవీలో చాలా చెట్లు ఎండిపోతున్నాయి. వాటిని కాపాడుకుంటే మరిన్ని అందాలను అనంతగిరి ప్రజలకు పంచుతుంది.