News January 29, 2025

నంద్యాల జిల్లాకు మరో 11 మద్యం షాపులు

image

నంద్యాల జిల్లాకు ప్రభుత్వం మరో 11 మద్యం దుకాణాలు కేటాయించినట్లు జిల్లా ఎక్సైజ్ శాఖ అసిస్టెంట్ సూపరింటెండెంట్ వీ.రాముడు ఓ ప్రకటనలో వెల్లడించారు. వీటిలో ఈడిగ సబ్ క్యాస్ట్ కులస్థులకు 7, గౌడ్స్‌కు 3, గౌడ కులానికి చెందిన వారికి ఒకటి కేటాయించారని తెలిపారు. అర్హత కలిగిన వారు రూ.2లక్షల చొప్పున ఆన్‌లైన్లో చెల్లించి, వచ్చేనెల 5వ తేదీ నుంచి మద్యం షాపుల కోసం దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు.

Similar News

News November 4, 2025

చిత్తూరు: ఆలస్యంగా వస్తున్న టీచర్లు..!

image

చిత్తూరు జిల్లాలో సుమారు 100 మంది ప్రభుత్వ టీచర్లు స్కూళ్లకు ఆలస్యంగా వస్తున్నారు. ఇదే విషయాన్ని ఉన్నతాధికారులు సైతం గుర్తించారు. టీచర్లు ఆలస్యంగా రావడంపై వివరణ కోరామని DEO వరలక్ష్మి చెప్పారు. ఆలస్యానికి గల కారణాలు చెప్పాలని ఆదేశించారు. టీచర్లు సమయపాలన పాటించాలని స్పష్టం చేశారు. ఆలస్యంగా రావడం, త్వరగా వెళ్లిపోవడం చేయకూడదని స్పష్టం చేశారు.

News November 4, 2025

వరంగల్: 123 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు

image

మద్యం తాగి వాహనాలు నడపటం ద్వారా జరిగే రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకుంటున్న చర్యల్లో భాగంగా వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో అదివారం డ్రంక్ అండ్ డ్రైవ్ చేపట్టారు. ఈ తనిఖీల్లో మొత్తం 123 కేసులు నమోదయ్యాయి. ఇందులో ట్రాఫిక్ విభాగంలో 74, సెంట్రల్ జోన్ పరిధిలో 23, వెస్ట్ జోన్ పరిధిలో 18 ఈస్ట్ జోన్ పరిధిలో 8 కేసులు నమోదయ్యాయి

News November 4, 2025

ఆధార్ PVC కార్డును ఈజీగా అప్లై చేయండిలా!

image

ఆధార్‌ను PVC కార్డుగా మార్చుకుంటే ఎక్కువ మన్నికగా ఉంటుంది. పర్సులో పెట్టుకోవడానికి కూడా అనువుగా ఉంటుంది. హోలోగ్రామ్, మైక్రో-టెక్స్ట్, సెక్యూర్ క్యూఆర్ కోడ్ వంటి అధునాతన భద్రతా ఫీచర్లను కలిగి ఉన్న ఈ కార్డును ఆన్‌లైన్‌లో సులభంగా ఆర్డర్ చేసుకోవచ్చు. UIDAI <>వెబ్‌సైట్‌లో<<>> మీ ఆధార్ నంబర్ లేదా EIDతో లాగిన్ అవ్వాలి. OTP ద్వారా ధ్రువీకరించి రూ.50 చెల్లిస్తే చాలు ఈ కార్డు ఇంటికే వస్తుంది. SHARE IT