News April 1, 2025

నంద్యాల జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రత 40.3°C

image

నంద్యాల జిల్లాలో సోమవారం అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) తెలిపింది. అయితే జిల్లాలోని గోస్పాడులో ఏకంగా 40.3°C ఉష్ణోగ్రత నమోదైంది. కాబట్టి ఎండలు ఎక్కువగా ఉన్న సమయాల్లో అవసరం అయితే తప్ప బయటకు రావద్దని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ ఎండలకు వేసవి తాపాన్ని తీర్చుకునేందుకు కూల్ డ్రింక్స్ వంటివి ఎక్కువగా తీసుకోరాదని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.

Similar News

News September 15, 2025

గుత్తి: 5 టన్నుల టమాటాలు పారబోశారు..!

image

ఉమ్మడి అనంతపురం జిల్లాలో టమాటా ధరలు రోజు రోజుకు పతనం అవుతున్నాయి. కనీసం ట్రాన్స్‌పోర్ట్ ఛార్జీలు కూడా రావడం లేదని రైతులు వాపోతున్నారు. గుత్తికి చెందిన రైతులు 500 బాక్సులను మార్కెట్‌కు తీసుకు వచ్చారు. కిలో రూ.5, రూ.3 మాత్రమే పలకడంతో ఇలా హైవే పక్కన టమాటాలను రైతులు పారబోశారు.

News September 15, 2025

బల్దియా ప్రజావాణిలో 99 దరఖాస్తులు: కమిషనర్

image

ప్రజావాణి వినతుల పరిష్కారంపై దృష్టి సారించాలని బల్దియా కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ అధికారులను ఆదేశించారు. బల్దియా కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. ప్రజావాణిలో ప్రజల సమస్యలు పరిష్కరించాలని 99 దరఖాస్తులు వచ్చాయని కమిషనర్ తెలిపారు. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను తత్వరమే పరిష్కరించాలని అన్నారు.

News September 15, 2025

అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపాలి: ఎస్పీ

image

అసాంఘిక కార్యకలాపాలపై పోలీసు అధికారులు ఉక్కు పాదం మోపాలని జిల్లా SP ఏఆర్ దామోదర్ అన్నారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఆయన సోమవారం తన కార్యాలయంలో పోలీసు అధికారులతో సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలను వివరించి, నిర్వహించాల్సిన విధుల గురించి అధికారులకు దిశా నిర్దేశం చేశారు. జిల్లాలోని ఆయా సబ్ డివిజన్ల పరిధిలో ప్రధాన నేరాలు, శాంతి భద్రతల సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు.