News August 14, 2025
నంద్యాల జిల్లాలో అత్యధిక వర్షం ఇక్కడే..!

నంద్యాల జిల్లాలోని 30 మండలాల్లో వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కొత్తపల్లె మండలంలో అత్యధికంగా 40.6 మి.మీ వర్షపాతం నమోదైంది. బండిఆత్మకూరు 34 మి.మీ, శ్రీశైలం 29.2 మి.మీ, ఆత్మకూరు 23.6 మి.మీ, పగిడ్యాల 22.8 మి.మీ, గడివేముల 18.2 మి.మీ, నంద్యాల అర్బన్ 15.6 మిమీ వర్షం కురిసింది. జిల్లాలో అత్యల్పంగా చాగలమర్రి మండలంలో 2.2 మి.మీ వర్షం పడింది.
Similar News
News August 16, 2025
ఉదయగిరి: దొంగలను పోలీసులుకు అప్పగించిన గ్రామస్థులు

ఉదయగిరి (M) కుర్రపల్లిలో మేకలు దొంగతనం చేసేందుకు యత్నించిన ముగ్గురిని గ్రామస్థులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. గ్రామానికి చెందిన గోర్తుల వినోద్ కుమార్‌కు చెందిన మేకల దొడ్డిలో మేకలను దొంగలించేందుకు వైఎస్సార్ కడప జిల్లా పోరుమామిళ్ల ప్రాంతానికి చెందిన ముగ్గురు దొంగలు ఆటోలో వచ్చారు. మేకలు ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించగా కుక్కలు అరవడంతో గ్రామస్థులు వారిని పట్టుకుని ఆటోతో సహా పోలీసులకు అప్పగించారు.
News August 16, 2025
NRPT: వారణాసిలో ప్రొఫెసర్‌పై హత్యాయత్నం

బెనారస్ వర్సిటీ ప్రొ. శ్రీరామచంద్రమూర్తిపై హత్యాయత్నం కేసులో ఊట్కూరు(M) ఆవుసలోనిపల్లికి చెందిన భాస్కర్‌ని యూపీ పోలీసులు అరెస్టు చేశారు. UP పోలీసుల వివరాలు.. వైస్ ఛాన్సలర్ పదవి కోసం ప్రొ.బూదాటి వెంకటేశ్వర్లు, ప్రొ.శ్రీరామచంద్రమూర్తి మధ్య పోటీ ఉంది. భాస్కర్‌కి ప్రొ.వెంకటేశ్వర్లు సుపారీ ఇచ్చి శ్రీరామచంద్రమూర్తిపై దాడి చేయించాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన శ్రీరామచంద్రమూర్తి చికిత్స పొందుతున్నారు.
News August 16, 2025
6నెలలు దేవుని కడప శ్రీవారి దర్శనం బంద్

దేవుని కడప శ్రీలక్ష్మీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో ఈనెల 19వ తేదీ నుంచి దర్శనాలు నిలిపివేస్తున్నట్లు TTD వెల్లడించింది. ఆలయ జీర్ణోద్ధరణ పనుల నేపథ్యంలో అంతరాలయ దర్శనాన్ని రద్దు చేశారు. 6నెలల పాటు బాలాలయంలో శ్రీవారి దర్శనానికి ఏర్పాట్లు చేస్తున్నారు. 18, 19న టీటీడీ అర్చకులు హోమాల చేస్తారు. 19వ తేదీ నుంచి బాలాలయంలో శ్రీవారికి నిత్య కైంకర్యాలు జరుగుతాయి.