News April 15, 2025
నంద్యాల జిల్లాలో ఇద్దరు దొంగల అరెస్ట్

నంద్యాలలో గత కొన్ని నెలలుగా దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగలను అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రానా తెలిపారు. మద్దికేర గ్రామానికి చెందిన దూదేకుల షాహిద్, పందిపాడు గ్రామానికి చెందిన దూదేకుల దస్తగిరిని సోమవారం అరెస్టు చేసి వారి వద్ద నుంచి బంగారం, నగదును స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఒంటరి మహిళలే వీరి టార్గెట్ అని తెలిపారు.
Similar News
News January 1, 2026
భద్రకాళి క్షేత్రంలో ఆధ్యాత్మిక వెల్లువ.!

భద్రకాళి అమ్మవారి ఆశీస్సులతో కొత్త ఏడాదిని ప్రారంభించేందుకు భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయం వద్ద క్యూలైన్లలో వేచి ఉండి అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తుల కోరికలు తీర్చే కల్పవల్లిగా కొలవబడే భద్రకాళి అమ్మవారికి అర్చకులు నిర్వహించిన ప్రత్యేక అలంకరణ భక్తులను మంత్రముగ్ధులను చేసింది. పూజా కార్యక్రమాల అనంతరం భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
News January 1, 2026
అక్రమ నిర్మాణాల క్రమబద్ధీకరణ GOపై హైకోర్టు నోటీసులు

AP: రాష్ట్రంలో అక్రమ నిర్మాణాల క్రమబద్ధీకరణపై జారీచేసిన GO 225పై హైకోర్టు ప్రభుత్వానికి నోటీసులు జారీచేసింది. మున్సిపల్ చట్ట నిబంధనలకు విరుద్ధంగా జీవో విడుదల చేశారని, అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకొనేలా ఆదేశించాలని దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (PIL)పై కోర్టు ఈ నోటీసులిచ్చింది. PILపై పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. కేసు విచారణను 4 వారాలకు వాయిదా వేసింది.
News January 1, 2026
విజయవాడ మహిళకు అమెరికాలో అదనపు కట్నం వేధింపులు.!

విజయవాడలోని అంబాపురానికి చెందిన ఓ మహిళ అదనపు కట్నం కోసం భర్త, అత్తమామలు వేధిస్తున్నారంటూ పోలీసులను ఆశ్రయించింది. పెళ్లిలో ₹40 లక్షల నగదు, ₹25 లక్షల బంగారం ఇచ్చినా, అమెరికా వెళ్లాక కూడా వేధిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొంది. తనను చిత్రహింసలకు గురిచేయడంతో ఒత్తిడికి లోనై శిశువును కోల్పోయినట్లు తెలిపింది. వేధింపులు తాళలేక స్వదేశానికి తిరిగి వచ్చి భర్త, కుటుంబంపై పోలీ స్టేషన్‌లో ఫిర్యాదు చేశామన్నారు.


