News April 22, 2024
నంద్యాల జిల్లాలో చంద్రబాబు షెడ్యూల్

నంద్యాల జిల్లా శ్రీశైలం మహాక్షేత్రంలో కొలువైన శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లను తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడు నేటి సోమవారం దర్శించుకున్నారు. హైదరాబాద్ బేగంపేట నుంచి హెలికాప్టర్లో బయలుదేరి 10.15 గంటలకు సున్నిపెంటకు చేరుకుంటారు. 10.45 సాక్షిగణపతి దర్శించుకుంటారు. 11.20 వీరభద్రస్వామి దర్శనం,11.40 నుంచి12.30 గంటల మధ్య భ్రమరాంబ మల్లిఖార్జున స్వాములను దర్శించుకుంటారు.
Similar News
News April 21, 2025
కర్నూలు: పిడుగుపాటుతో యువకుడి మృతి

కర్నూలు జిల్లా పెద్దకడబూరు మండలం హనుమాపురంలో విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గొల్ల గోవిందు కుమారుడు గొల్ల ఈరన్న మరికొందరు ఆదివారం రాత్రి ఎమ్మిగనూరు SML డిగ్రీ కాలేజ్ వద్ద ఉన్నారు. అక్కడ ఒక్కసారిగా మెరుపులతో పిగుడు పడింది. దీంతో అక్కడున్న నలుగురు స్వల్ప గాయాలు కాగా.. ఈరన్న అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News April 21, 2025
రక్తదానం చేసిన కర్నూలు ఎంపీ నాగరాజు

రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు 75వ జన్మదినం సందర్భంగా.. కర్నూలులోని బ్లడ్ బ్యాంకులో TDP నాయకులు ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని MP నాగరాజు ప్రారంభించారు. అనంతరం ఎంపీ స్వయంగా రక్తదానం చేశారు. చంద్రబాబు ఎల్లప్పుడు ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలతో ఉండాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. కార్యకర్తలకు అండగా నిలుస్తానన్నారు.
News April 20, 2025
కర్నూలు జిల్లా నేటి ముఖ్యాంశాలు

➤ కర్నూల్ జిల్లా TDP నాయకుడు సురేంద్ర మృతి
➤కర్నూలు: 3 శాతానికి పెరిగిన స్పోర్ట్స్ కోటా.!
➤రూపాయి నోటుపై సీఎం చంద్రబాబు చిత్రం
➤కానిస్టేబుల్ హత్య కేసులో నిందితుల అరెస్ట్
➤కోవెలకుంట్లలో క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టురట్టు
➤అనంత: బీటెక్ ఫలితాలు విడుదల
➤సురేంద్ర మృతి పార్టీకి తీరని లోటు: కర్నూలు MP
➤సీఎం బర్త్ డే.. ఎమ్మిగనూరులో 75 కేజీల కేక్ కటింగ్
➤కర్నూలు జిల్లాలో దంచికొట్టిన వర్షం