News March 16, 2025

నంద్యాల జిల్లాలో చికెన్ ధరలు

image

నంద్యాల జిల్లాలో చికెన్ ధరలు నేడు ఈ విధంగా ఉన్నాయి. బనగానపల్లె, కోవెలకుంట్లలో స్కిన్ లెస్ చికెన్ రూ.160-180 ఉండగా, స్కిన్ రూ.140 విక్రయిస్తున్నారు. సంజామలలో స్కిన్ లెస్ రూ.200 ఉండగా, స్కిన్ రూ.180కి అమ్ముతున్నారు. నంద్యాలలో స్కిన్ రూ.170-180కి అమ్ముతున్నారు. కాగా, ఆళ్లగడ్డలో రూ.100కే విక్రయిస్తున్నారు.

Similar News

News March 29, 2026

ఇండియాలో పాపులర్ బ్రాండ్లు.. ఫుల్ నేమ్స్

image

*PVR- ప్రియా విలేజ్ రోడ్‌షో
*MRF- మద్రాస్ రబ్బర్ ఫ్యాక్టరీ
*ITC- ఇండియన్ టొబాకో కంపెనీ
*DLF- ఢిల్లీ ల్యాండ్ & ఫైనాన్స్
*HCL- హిందుస్థాన్ కంప్యూటర్స్ లిమిటెడ్
*AMUL- ఆనంద్ మిల్క్ యూనియన్ లిమిటెడ్
*OYO- ఆన్ యువర్ ఓన్
*TVS: Thirukkurungudi Vengaram Sundram

News March 29, 2026

పలువురు ఐఏఎస్‌ల బదిలీ

image

AP: రాష్ట్రంలో పలువురు ఐఏఎస్‌లను ప్రభుత్వం బదిలీ చేసింది. కాకినాడ కలెక్టర్ షణ్మోహన్‌ను ఏపీఈడీబీ సీఈవోగా, అల్లూరి జిల్లా కలెక్టర్ దినేశ్ కుమార్‌ను ఏపీఐఐసీ ఎండీగా నియమించింది. అల్లూరి కలెక్టర్‌గా టి.నిశాంతి, విశాఖకు అభిషిక్త్ కిశోర్, గుంటూరుకు సాయికాంత్ వర్మ, కాకినాడకు హరేంద్రప్రసాద్‌ను బదిలీ చేసింది. పాఠశాల విద్య డైరెక్టర్‌గా తమిమిన్ అన్సారియాను నియమించింది.

News March 29, 2026

KNR: నిద్రపోతున్న నిఘా నేత్రం.. రెచ్చిపోతున్న దొంగలు

image

శాంతి భద్రతలు, నేరాలను నియంత్రించడంలో CC కెమెరాల పాత్ర కీలకం. వీటి నియంత్రణను పట్టించుకునే నాథుడు లేకపోవడంతో నిఘానేత్రం నేల చూపు చూస్తుంది. ఉన్న CC కెమెరాల్లో చాలా వరకు పనిచేయకపోవడంతో ఉమ్మడి KNR జిల్లా వ్యాప్తంగా తాళం వేసి ఉన్న ఇండ్లలో చోరీలు చేస్తూ దొంగలు రెచ్చిపోతున్నారు. ఇప్పటికైనా పోలీసులు CC కెమెరాల నియంత్రణపై దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు.