News January 28, 2025
నంద్యాల జిల్లాలో నలుగురికి ఏడు సంవత్సరాల జైలు శిక్ష

దొంగ నోట్ల కేసులో నలుగురికి ఏడు సంవత్సరాల జైలు శిక్ష, ఒక్కొక్కరికి రూ.8వేల జరిమానా విధిస్తూ నంద్యాల జిల్లా కోర్టు మంగళవారం తీర్పు చెప్పింది. వివరాల్లోకి వెళ్తే.. బండి ఆత్మకూరు గ్రామానికి చెందిన ఆరుగురు యువకులు 2017లో దొంగ నోట్లు తయారు చేస్తూ పోలీసులకు పట్టుబడ్డారు. అందులో ఇద్దరు చనిపోగా, నలుగురికి ఏడు సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ ప్రిన్సిపల్ అసిస్టెంట్ సెషన్స్ జడ్జి కోర్టు తీర్పు వెలువరించింది.
Similar News
News November 3, 2025
వరంగల్ మార్కెట్‌కి వచ్చిన 7వేల మిర్చి బస్తాలు

వరంగల్ ఎనుమాముల మార్కెట్‌లో సోమవారం సుమారు 7వేల మిర్చి బస్తాలు తరలివచ్చినట్లు మార్కెట్ అధికారులు తెలిపారు. ఈ క్రమంలో వివిధ రకాల మిర్చి ధరలు ఇలా ఉన్నాయి. 341 రకం మిర్చి క్వింటాకు రూ.16, 200, వండర్ హాట్ (WH) మిర్చి రూ.15,500 పలికింది. అలాగే, తేజ మిర్చి ధర రూ.14,000, దీపిక మిర్చి రూ.14 వేలు పలికిందని వ్యాపారులు చెప్పారు.
News November 3, 2025
బస్సు ప్రమాదంపై చంద్రబాబు, పవన్ దిగ్భ్రాంతి

మీర్జాగూడ <<18183773>>బస్సు<<>> ప్రమాదంపై ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేశ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనలో ప్రయాణికుల మృతి తీవ్రంగా కలచివేసిందని చంద్రబాబు తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మృతుల కుటుంబాలకు పవన్ సైతం సానుభూతి ప్రకటించి క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు.
News November 3, 2025
ఈనెల 5న మెగా జాబ్ మేళా

AP: అనకాపల్లి జిల్లా చోడవరం ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ఈనెల 5న మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. టెన్త్, ఇంటర్, డిగ్రీ, ఐటిఐ, డిప్లొమా, పీజీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు హాజరుకావొచ్చు. 18 నుంచి 35 ఏళ్ల మధ్య వయసు ఉండాలి. ఈ జాబ్ మేళాలో 18 మల్టీ నేషనల్ కంపెనీలు పాల్గొననున్నాయి. ఆసక్తిగల అభ్యర్థులు naipunyam.ap.gov.in వెబ్ సైట్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.


