News March 1, 2025
నంద్యాల జిల్లాలో నేటి నుంచి ఇంటర్ పరీక్షలు

నంద్యాల జిల్లాలో నేటి నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇవాళ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు ఉ.9 నుంచి మ.12 వరకు పేపర్-1 సెకండ్ లాంగ్వేజ్ పరీక్ష జరగనుంది. జిల్లాలోని 53 పరీక్ష కేంద్రాల్లో.. మొత్తంగా 15,692 మంది ఫస్ట్ ఇయర్ విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. కాగా పరీక్షల నిర్వహణకు 550 మంది ఇన్విజిలేటర్లను జిల్లా ఇంటర్ బోర్డు అధికారులు నియమించారు.☞ విద్యార్థులకు ALL THE BEST
Similar News
News September 18, 2025
మంచిర్యాల: ‘మేదరి కులస్థులకు ప్రభుత్వం చేయూత ఇవ్వాలి’

మంచిర్యాల పట్టణంలో గురువారం ప్రపంచ వెదురు దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. వెదురుతో తయారు చేసిన వస్తువులను ప్రదర్శించారు. అనంతరం మేదరి మహేంద్ర సంఘం జిల్లా అధ్యక్షుడు సూరినేని కిషన్ మాట్లాడుతూ.. కుల వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న మేదరులకు రాష్ట్ర ప్రభుత్వం వెదురు బొంగులు ఉచితంగా సరఫరా చేయాలని, ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందేలా చూడాలని కోరారు.
News September 18, 2025
ఆందోల్: మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక దృష్టి: మంత్రి

నిలోఫర్ ఆసుపత్రిలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు మంత్రి దామోదర్ రాజానర్సింహా పేర్కొన్నారు. ఆసుపత్రిలో అన్ని విభాగాలను పటిష్ఠ పర్చాలని మంత్రి దిశానిర్దేశం చేసారు. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు నిర్మిస్తున్న నూతన భవన నిర్మాణ పనులు శరవేగంగా పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో హెల్త్ సెక్రటరీ, ఎండీ తదితరులు పాల్గొన్నారు.
News September 18, 2025
పెద్దవం, ఐ.పంగిడీ గ్రామాల్లో కలెక్టర్ కీర్తి చేకూరి పర్యటన

ప్రత్యేక నిపుణుల పర్యవేక్షణలో పశువుల చికిత్సలకు ప్రత్యేక వైద్యుల బృందాన్ని రాష్ట్ర ప్రభుత్వం పంపడం జరిగిందని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. గురువారం తాళ్లపూడి మండలం పెద్దేవం, ఐ.పంగిడీ గ్రామాల్లో కలెక్టర్ పర్యటించి రైతులతో ముఖాముఖి మాట్లాడారు. గేదెల వ్యాధి నియంత్రణకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని, రైతులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.