News March 25, 2025
నంద్యాల జిల్లాలో నేటి ముఖ్యాంశాలు.!

☞ రేషన్ కార్డుదారులు తప్పనిసరిగా E-KYC చేయించుకోవాలి: జేసీ
☞ చంద్రబాబు ఎంతమందికి జరిమానాలు విధించాడు?: కాటసాని
☞ కోడుమూరు ఘటన.. విద్యార్థిపై కేసు నమోదు
☞ శ్రీశైలంలో ఎటు చూసినా భక్తుల వాహనాలే
☞ కర్ర సాములో అదరగొడుతున్న ఉయ్యాలవాడ మోడల్ స్కూల్ విద్యార్థి
☞ రంగాపురానికి చెందిన IIT విద్యార్థి ఆత్మహత్య
☞ ఆళ్లగడ్డ MLA భర్త కిలో చికెన్ కు రూ.10 వసూలు: YCP
☞ బెట్టింగ్ లపై ఎస్పీ హెచ్చరిక
Similar News
News March 26, 2025
రేపు పోలవరం ప్రాజెక్ట్ పరిశీలించనున్న చంద్రబాబు

రేపు పోలవరం ప్రాజెక్టును సీఎం చంద్రబాబు సందర్శించనున్నారు. ఈ మేరకు బుధవారం సీఎమ్ఓ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. పర్యటనలో భాగంగా సీఎం పోలవరం ప్రాజెక్ట్ పనులను పరిశీలించనున్నారు. రేపు ఉదయం 11 గంటలకు హిల్ వ్యూకు సీఎం చేరుకోనున్నారు. డయాఫ్రమ్ వాల్, కాపర్ డ్యామ్ పనులను పరిశీలించనున్నారు. అనంతరం పోలవరం ప్రాజెక్ట్ పనులపై సీఎం సమీక్ష నిర్వహిస్తారు.
News March 26, 2025
MBNR: ఆర్టీసీ బస్టాండ్‌లో కంకర తేలిన సీసీ రోడ్డు

మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్‌లో సీసీ రోడ్డు పూర్తిగా అధ్వానంగా మారడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షాలకు బస్టాండ్ ఆవరణలో నీరు నిలిచి కంకర తేలి, గొయ్యిలా ఏర్పడి ప్రయాణికులు, విద్యార్థులకు, ఆర్టీసీ బస్సు వాహనాదారులకు ఇబ్బందికరంగా మారింది. వెంటనే రోడ్డు, రవాణా, ఆర్టీసీ అధికారులు సమస్యను పరిష్కరించాలని ప్రయాణికులు కోరుతున్నారు.
News March 26, 2025
సైదాపూర్: వృద్ధురాలిపై యువకుడి అత్యాచారం

సైదాపూర్ మండలంలోని ఓ గ్రామంలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. 70 ఏళ్ల వృద్ధురాలిపై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆదివారం రాత్రి ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో యువకుడు ఆమెపై ఈ దారుణానికి ఒడిగట్టాడు. అనంతరం ఎవరికైనా జరిగిన విషయం చెబితే చంపుతానని బెదిరించి అక్కడి నుంచి పారిపోయాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.