News March 28, 2025
నంద్యాల జిల్లాలో నేటి ముఖ్యాంశాలు.!

☞ ఉమ్మడి కర్నూలు జిల్లాలో నలుగురికి నామినేటెడ్ పదవులు
☞ మోత్కూరులో భర్త చేతిలో భార్య దారుణ హత్య
☞ చికెన్ ధరలు తగ్గుతుంటే అవినీతి ఎక్కడ?: ఆళ్లగడ్డ ఎమ్మెల్యే
☞ బీడు భూముల్లో ఉద్యాన పంటలను ప్రోత్సహించాలి: కలెక్టర్
☞ ఆ నిధులు ఎవరి జేబుల్లోకి వెళ్లినట్టు?: శ్వేతా రెడ్డి
☞ శ్రీశైలంలో రెండో రోజు ఘనంగా ఉగాది ఉత్సవాలు
☞ బనగానపల్లెలో ముస్లింల భారీ ర్యాలీ
☞ రుద్రవరంలో అత్యధిక ఉష్ణోగ్రత
Similar News
News March 31, 2025
MBNR: పండుగ రోజు LRS కోసం ఎవరూ రాలే..!

ఎల్ఆర్ఎస్ కోసం ప్రభుత్వం ప్రకటించిన 25% రాయితీ నేటితో ముగియనుంది. పండుగ రోజును సైతం లెక్కచేయకుండా మహబూబ్‌నగర్ నగరపాలిక సంస్థ అధికారులు కార్యాలయాన్ని తెరిచి ఉంచినా దరఖాస్తుదారులు ఒక్కరు కూడా ముందుకు రాలేదు. పట్టణంలో 31,190 దరఖాస్తులు రాగా ఇప్పటివరకు కేవలం 1,800 మాత్రమే పరిష్కారమయ్యాయి. మిగిలిన వారు ఏమాత్రం స్పందించడం లేదు.
News March 31, 2025
గుండె సమస్య.. ముంబైకి కొడాలి నాని తరలింపు

వైసీపీ నేత, మాజీ మంత్రి కొడాలి నానిని ముంబైకి తరలిస్తున్నారు. ఇటీవల గుండె సమస్యతో హైదరాబాద్ ఏఐజీ ఆస్పత్రిలో చేరిన నానిని ఇవాళ డిశ్చార్జ్ చేశారు. రక్తనాళాల్లో బ్లాక్‌లకు సర్జరీ చేయాలని సూచించారు. దీంతో మెరుగైన చికిత్స కోసం ఆయనను ముంబైకి తరలిస్తున్నారు. నాని కుటుంబసభ్యులు ప్రత్యేక విమానంలో అక్కడికి బయల్దేరారు.
News March 31, 2025
గుంటూరు నగరంలో ఎస్పీ ఆకస్మిక తనిఖీ

గుంటూరు నగరంలో సోమవారం ఎస్పీ సతీశ్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. క్షేత్ర స్థాయిలో పోలీస్ అధికారులు, సిబ్బంది పనితీరును పరిశీలించారు. రంజాన్ పర్వదినం సందర్భంగా ట్రాఫిక్ నియంత్రణ, బందోబస్తు నిర్వహిస్తున్న తీరును తనిఖీ చేశారు. ఎస్పీ మాట్లాడుతూ.. అధికారులు, సిబ్బందిలో వివిధ నిర్వాహణలో జవాబు దారీతనాన్ని పెంపొందించడానికి ఈ తనిఖీలు నిర్వహించినట్లు తెలిపారు.