News April 4, 2025
నంద్యాల జిల్లాలో నేటి ముఖ్యాంశాలు.!

☞నంద్యాల GGHలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ☞ఎద్దుల బండలాగుడు పోటీలు ప్రారంభించిన మంత్రి BC☞కందనాతిలో పిడుగుపాటుతో బాలుడి మృతి☞బనగానపల్లె ఆసుపత్రిలో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీ☞CMRF చెక్కులు పంపిణీ చేసిన MLAలు☞నందవరం చౌడమ్మ హుండీ ఆదాయం రూ.4.21లక్షలు☞మంత్రి లోకేశ్‌ను కలిసిన ఆళ్లగడ్డ MLA☞కేంద్ర మంత్రికి ఎంపీ శబరి వినతి☞8 మంది ఎస్ఐలకు పోస్టింగులు
Similar News
News April 4, 2025
నిర్మల్: రేపు కలెక్టరేట్‌లో జగ్జీవన్ రామ్ జయంతి

నిర్మల్ పట్టణంలోని కలెక్టరేట్‌లో శనివారం ఉదయం 10 గంటలకు డా.బాబు జగ్జీవన్ రామ్ జయంతిని నిర్వహించనున్నట్లు కలెక్టర్ అభిలాష అభినవ్ శుక్రవారం ప్రకటనలో తెలిపారు. జయంతి వేడుకలకు జిల్లాలోని అధికారులు, కుల సంఘాల ప్రజలు, అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని తెలిపారు.
News April 4, 2025
టారిఫ్ లిస్టులో పెంగ్విన్ ద్వీపం.. ట్రంప్.. పాపం!

ట్రంప్ టారిఫ్ లిస్ట్ ప్రపంచాన్ని కలవరపెడుతుంటే సోషల్ ప్రపంచం మాత్రం ఆయన్ను ఆడేసుకుంటోంది. ప్రతీకార సుంకాల లిస్టులో ఆస్ట్రేలియా పరిధిలోని మెక్‌డొనాల్డ్ ద్వీపం (అంటార్కిటికా ఖండ ఉపభాగం) కూడా ఉంది. ఈ ద్వీపంలో మనుషులే ఉండరు. పెంగ్విన్లు మాత్రమే నివసించే ఈ ప్రాంతం కూడా 10% దిగుమతి టారిఫ్‌కు గురవడంతో మీమర్స్ బుర్రను షార్ప్ చేసి ట్రంప్‌ను చెక్కేస్తున్నారు. పైన గ్యాలరీలో మీరు కొన్ని మీమ్స్ చూడవచ్చు.
News April 4, 2025
మహబూబాబాద్‌లో ‘అమ్మ పేరు మీద ఒక చెట్టు’

మహబూబాబాద్ జిల్లాలోని DFO ఆఫీసులో “అమ్మ పేరు మీద ఒక చెట్టు” పథకం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా జాతీయ ST కమిషన్ సభ్యులు జాటోతు హుస్సేన్ నాయక్ పాల్గొని చెట్లు నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గ్రామంలో ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో భాగస్వాములై తప్పనిసరిగా మొక్కలు నాటాలన్నారు. నాటిన మొక్కలపై అమ్మపై చూపించే చూపించాలని పేర్కొన్నారు.