News April 12, 2025
నంద్యాల జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

☞బండి ఆత్మకూరులో ఇంటర్ ఫెయిల్ కావడంతో మరో విద్యార్థి ఆత్మహత్య☞అన్నమయ్య జిల్లా DRDC సమావేశంలో మంత్రి బీసీ☞ఇంటర్ ఫలితాల్లో ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాల విద్యార్థుల ప్రతిభ☞నంద్యాల మున్సిపల్ కార్యాలయం మార్పునకు రంగం సిద్ధం☞మహానందిలో ఒకేరోజు 15 పెళ్లిళ్లు☞మానవత్వం చాటుకున్న ఎమ్మెల్యే గౌరు చరిత ☞బాదంపప్పుపై ఆంజనేయస్వామి చిత్రం: చింతలపల్లె కోటేశ్
Similar News
News April 13, 2025
ఏలూరు: కుమార్తెకు న్యాయం చేయాలని తండ్రి ధర్నా

తన కుమార్తెకు న్యాయం చేయాలని తండ్రి ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట ధర్నా చేసిన ఘటన శనివారం చోటుచేసుకుంది. ముసునూరులోని అక్కిరెడ్డిగూడెనికి చెందిన ఉమా శిరీష, నవీన్ అనే వ్యక్తితో ప్రేమలో పడింది. ప్రేమ వ్యవహారంలో చెలరేగిన వివాదంలో శిరీష పురుగుమందు సేవించి ఆత్మహత్యకు పాల్పడింది. ప్రియుడిని అరెస్ట్ చేయాలని తండ్రి నాగరాజు పురుగుమందు డబ్బాతో ధర్నా చేశాడు. పోలీసులు విచారణ చేస్తున్నట్లు తెలిపారు.
News April 13, 2025
వైసీపీ పీఏసీ కమిటీలో కడప జిల్లా నాయకులకు చోటు

వైసీపీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీలో కడప జిల్లాకు చెందిన నాయకులకు అధిష్ఠానం చోటు కల్పించింది. కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డితో పాటు మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషాలకు పీఏసీ కమిటీలో స్థానం కల్పిస్తూ వైసీపీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. వైసీపీ పీఏసీ కన్వీనర్‌గా సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో సభ్యులు ఉంటారు.
News April 13, 2025
సోంపేట: పేపర్ బాయ్‌కి 981 మార్కులు

సోంపేటకు ఓ కళాశాలలో చదువుతున్న సాయి గణేశ్ ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ఎంపీసీ గ్రూపు చదువుతున్నాడు. శనివారం విడుదలైన ఇంటర్ ఫలితాల్లో 1000కి 981 మార్కులు సాధించి సత్తా చాటాడు. గణేష్ తండ్రి మరణించడంతో పేపర్ బాయ్‌గా పని చేస్తూ చదువుకు పేదరికం అడ్డు రాదని నిరూపించాడు. ఈయన కృషి పట్టుదలను మెచ్చి పాఠశాల యాజామాన్యం చదువుకునేందుకు సహాయ సహకారాలు అందించింది.