News March 4, 2025
నంద్యాల జిల్లాలో నేటి ముఖ్య వార్తలు

☞ కొలిమిగుండ్లలో ఆర్టీసి బస్సు బోల్తా ☞ పాణ్యం ఎమ్మెల్యేకు RRR అభినందన ☞ కర్నూలులో ఘోర ప్రమాదం.. రిటైర్డ్ వార్డెన్ మృతి ☞ పాతపాడులో తల్లిదండ్రులు లేని యువతికి ఆర్థిక సాయం ☞ శ్రీశైలం జలాశయం నుంచి 7,345 క్యూసెక్కుల నీటి విడుదల ☞ గుడిపాడుకు చెందిన డిగ్రీ విద్యార్థి అదృశ్యం ☞ PTC నుంచి పాస్ అవుట్ అయిన జిల్లా SIలు ☞ వేసవిలో తాగునీటి నివారణకు చర్యలు: కలెక్టర్ ☞ బస్సు బోల్తాపై మంత్రులు ఆరా
Similar News
News November 4, 2025
నా భార్యను తాళి వేసుకోవద్దనే చెప్తా: రాహుల్

రాహుల్ రవీంద్రన్ తన భార్య, గాయని చిన్మయి శ్రీపాద మంగళసూత్రం ధరించడంపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఇటీవల ‘గర్ల్ ఫ్రెండ్’ మూవీ ప్రమోషన్స్‌లో రాహుల్ మాట్లాడారు. ‘పెళ్లి తర్వాత మంగళసూత్రం ధరించాలా వద్దా అనేది పూర్తిగా నా భార్య చిన్మయి నిర్ణయం. నేను తాళి వేసుకోవద్దనే చెప్తా. ఎందుకంటే పెళ్లి తర్వాత అమ్మాయిలకు తాళి ఉన్నట్లు అబ్బాయిలకు ఎలాంటి ఆధారం లేదు. ఇది ఒక వివక్ష లాంటిదే’ అని చెప్పారు.
News November 4, 2025
వరంగల్: రైతన్నకు నిరాశ.. తగ్గిన మొక్కజొన్న ధర

వరంగల్ ఎనుమాముల మార్కెట్‌కు మంగళవారం మొక్కజొన్న భారీగా తరలివచ్చింది. ఈ క్రమంలో సోమవారంతో పోలిస్తే నేడు మక్కల ద్వారా తగ్గింది. సోమవారం మక్కలు (బిల్టీ) క్వింటాకి రూ.2,095 ధర రాగా, నేడు రూ.2,055 ధర వచ్చింది. అలాగే దీపిక మిర్చి రూ.14,500 ధర పలికింది. దీంతో రైతన్నలు తీవ్రంగా నిరాశ చెందుతున్నారు. ఉదయం కురిసిన భారీ వర్షానికి మొక్కజొన్న తడవడం, ధర సైతం తగ్గడంతో అన్నదాతలు తీవ్ర ఆవేదన చెందుతున్నారు.
News November 4, 2025
తిరుపతి జిల్లాకు కుంకీ ఏనుగుల అవసరం లేదు: DFO

కుంకీ ఏనుగుల అవసరం చిత్తూరు జిల్లాకే ఎక్కువగా ఉంటుందని.. తిరుపతికి అవసరం లేదని DFO సాయిబాబా చెప్పారు. ‘నడకమార్గంలో లైటింగ్ పెంచుతున్నాం. అలిపిరిలో 10, యూనివర్సిటీలో 5మంది సిబ్బందిని నియమించి చిరుత కదలికలను ట్రాక్ చేస్తున్నాం. వ్యర్థాల దగ్గర కుక్కలు, ఎలుకలు తిరుగుతున్నాయి. వాటిని తినడానికి చిరుతలు వస్తున్నాయి. వాటిని బంధించాల్సిన అవసరం లేదు. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది’ అని చెప్పారు.


