News March 8, 2025

నంద్యాల జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

☞ బేతంచర్ల ఘాట్ రోడ్డులో తప్పిన పెను ప్రమాదం☞ ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలకు 461 మంది డుమ్మా☞ బెలుం సింగవరంలో భార్య హత్య కేసులో భర్త అరెస్ట్☞ అంతర్జాతీయ స్థాయి పోటీలకు సంజామల PD☞ ప్రతిభకు వికలత్వం అడ్డుకాదు: ఎంపీ శబరి☞ కోవెలకుంట్లలో తండ్రి కొడుకుల అదృశ్యం☞ పోసానిని కష్టడికి ఇవ్వండి: ఆదోని పోలీసులు☞ శ్రీశైలంలో భక్తుల తాకిడి☞ రైతు నగర్‌లో భారీ చోరి☞ జిల్లాలో ఘనంగా మహిళా దినోత్సవం

Similar News

News February 19, 2026

నెల్లూరు MP నకిలీ PA అరెస్ట్..!

image

నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి పీఏనని చెప్పుకుంటూ బెదిరింపులకు పాల్పడిన వ్యక్తిని 4వ పట్టణ పోలీసులు గురువారం అదుపులోకి తీసుకున్నారు. తిరుపతికి చెందిన నదీమ్‌గా ఎంపీ పీఏనని ప్రచారం చేసుకుంటున్నాడు. ఈక్రమంలో జమ్మలమడుగుకు చెందిన గొల్ల నరేశ్ అనే వ్యక్తిని బెదిరించాడు. వాళ్లు ఎంపీ కార్యాలయానికి సమాచారం ఇవ్వడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు ఎంపీ కార్యాలయం తెలిపింది.

News February 19, 2026

రైతులను పెళ్లాడే మహిళలకు ప్రోత్సాహకాలు ఇవ్వండి.. MLA అభ్యర్థన

image

కర్ణాటకలో INC MLA రంగనాథ్ ఓ వినూత్న ప్రతిపాదనతో CM సిద్దరామయ్యకు లేఖ రాశారు. రైతులను వివాహం చేసుకునే మహిళలకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని కోరారు. ‘నేను ప్రాతినిధ్యం వహిస్తోన్న కునిగల్ సెగ్మెంట్‌లో మెజార్టీ ఫ్యామిలీలకు అగ్రికల్చరే జీవనోపాధి. అక్కడ వ్యవసాయం చేసే యువకులను పెళ్లి చేసుకోవడానికి యువతులు ముందుకు రావట్లేదు. దీంతో చాలామంది 30ఏళ్లు దాటినా ఒంటరిగానే మిగిలిపోతున్నారు’ అని పేర్కొన్నారు.

News February 19, 2026

యూట్యూబర్ అన్వేష్‌‌కు బిగ్ షాక్!

image

తెలుగు యూట్యూబర్ అన్వేష్‌‌కు బిగ్ షాక్ తగిలింది. అతడి ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ను మెటా యాజమాన్యం బ్లాక్ చేసినట్లు తెలుస్తోంది. ఆ పేజీకి 1.3 మిలియన్ల ఫాలోవర్లు ఉండగా.. ఇన్‌స్టాలో చెక్ చేస్తే జీరోగా కనిపిస్తోంది. ఫీడ్ కూడా మాయం అయింది. కాగా హిందూ దేవుళ్లపై అసభ్యకర వ్యాఖ్యలు చేసినందుకు అతడిపై కేసు నమోదైంది. అన్వేష్ ఇన్‌స్టాను బ్లాక్ చేయాలని హైదరాబాద్ CCS పోలీసులు మెటా కంపెనీకి లేఖ రాసిన సంగతి తెలిసిందే.