News March 9, 2025

నంద్యాల జిల్లాలో నేటి TOP NEWS

image

☞ అబద్ధపు హామీలతోనే టీడీపీ గద్దెనెక్కింది: కాటసాని ☞ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన మంత్రి బీసీ ☞ గాజుల పల్లెలో రైల్వే బోగీల తొలగింపు.. రైళ్ల రాకపోకల పున:ప్రారంభం ☞ ఆళ్లగడ్డలో మొబైల్ షాప్ ఓపెనింగ్.. ఓనర్, కస్టమర్ మధ్య వివాదం ☞ అర్ధరాత్రి కర్నూలుకు పోసాని ☞ బనగానపల్లెలో ఆర్టీసీ బస్సు, టిప్పర్‌ ఢీ ☞ బైక్ కొనివ్వలేదని యువకుడి ఆత్మహత్య ☞ అధికారంతో దాడులు చేసింది వైసీపీనే: కాట్రెడ్డి

Similar News

News March 10, 2025

ఎడ్‌సెట్ నోటిఫికేషన్ విడుదల

image

TG: బీఎడ్‌లో ప్రవేశాలకు సంబంధించి ఎడ్‌సెట్ నోటిఫికేషన్ విడుదలైంది. జూన్ 1న ఎంట్రన్స్ ఎగ్జామ్ నిర్వహించనున్నట్లు కన్వీనర్ వెంకట్రామ్ రెడ్డి తెలిపారు. ఎల్లుండి నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కానుండగా మే 24వరకు లేట్ ఫీజుతో స్వీకరిస్తామన్నారు. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.550, మిగతావారు రూ.750 ఫీజు చెల్లించాలని పేర్కొన్నారు.
వెబ్‌సైట్: https://edcet.tgche.ac.in

News March 10, 2025

సంగారెడ్డి జిల్లాలో 122 టెన్త్ పరీక్ష కేంద్రాలు

image

సంగారెడ్డి జిల్లాలో ఈనెల 21 నుంచి జరిగే పదవ తరగతి పబ్లిక్ పరీక్షలకు 122 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ సంవత్సరం 22,411 మంది విద్యార్థులు పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు రాయనున్నట్లు చెప్పారు. పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తగిన చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు.

News March 10, 2025

MHBD: డోర్నకల్‌కు యంగ్ ఇండియా గురుకులం

image

యంగ్​ ఇండియా ఇంటిగ్రేటెడ్​ గురుకుల పాఠశాలల నిర్మాణానికి రూ.11 వేల కోట్లను విద్యాశాఖ మంజూరు చేసింది. 55 అసెంబ్లీ నియోజకవర్గాల్లో గురుకుల పాఠశాలల నిర్మాణానికి నిధులు మంజూరు చేసింది. ఒక్కో స్కూల్​కు రూ.200 కోట్లు చొప్పున పరిపాలన అనుమతులను మంజూరు చేస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాలో డోర్నకల్ నియోజకవర్గంలో ఏర్పాటుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది.

error: Content is protected !!