News March 15, 2025
నంద్యాల జిల్లాలో నేటి TOP NEWS

☞ ఆళ్లగడ్డలో లారీ ఢీకొని వ్యక్తి దుర్మరణం
☞ అహోబిలంలో చీఫ్ సెక్రటరీ ప్రత్యేక పూజలు
☞ గోస్పాడు మండలంలో రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రత
☞ సంజన్న హత్య.. కంటతడి పెట్టిన ఎంపీ శబరి
☞ నందికొట్కూరులో భార్యను హతమార్చిన భర్త
☞ కలెక్టరేట్లో తాగునీటి సరఫరాపై మంత్రుల ఉన్నత స్థాయి సమీక్ష
☞ నంద్యాలలో అధిక ధరలకు స్టాంపులు దందా
☞ పలుచోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం
☞ జిల్లా వ్యాప్తంగా స్వచ్ఛతా కార్యక్రమం
Similar News
News March 17, 2025
కామారెడ్డి: భార్యని చంపిన భర్త

అనుమానంతో భార్యని చంపాడో భర్త. ఈ ఘటన HYDలోని అంబర్‌పేట్‌లో జరిగింది. పోలీసుల వివరాలు.. కామారెడ్డి (D) దోమకొండ (M) అంబర్‌పేటకు చెందిన నవీన్‌కు బీబీపేట్(M)కు చెందిన రేఖ(27)తో పెళ్లైంది. వీరు HYDలో అంబర్‌పేట్‌లో నివాసం ఉంటున్నారు. మద్యానికి బానిసైన నవీన్ భార్య ప్రవర్తనపై అనుమానంతో ఈనెల 10న పెట్రోల్ పోసి నిప్పంటించగా.. చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందింది. రేఖ తల్లి ఫిర్యాదుతో కేసు నమోదైంది.
News March 17, 2025
పల్నాడు జిల్లాలో పలువురు పోలిస్ సిబ్బంది బదిలీలు

పల్నాడు జిల్లాలో పలువురు పోలీసు సిబ్బందిని బదిలీలు చేస్తూ ఎస్పీ శ్రీనివాసరావు ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలో వివిధ పోలిస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న పలువురు ఎఎస్ఐలు, హెడ్ కానిస్టేబుళ్లను బదిలీలు చేస్తూ ఉత్తర్వులిచ్చారు. అదే విధంగా పలువురు స్పెషల్ బ్రాంచ్ సిబ్బందిని బదిలీలు చేస్తూ, పోస్టింగ్స్ ఇచ్చారు.
News March 17, 2025
NGKL: వలస కార్మికుడి మృతి

కొల్లాపూర్ మండలంలో ఓ వలస కార్మికుడు మృతిచెందిన ఘటన ఆదివారం జరిగింది. పోలీసుల వివరాలు.. అస్సాంలోని మాదాపూర్‌కి చెందిన వినోద్‌దాస్(35) ఎల్లూరు శివారులో కొనసాగుతున్న పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పనులు చేసేందుకు వలస వచ్చాడు. ఆదివారం మద్యం తాగి నడుస్తుండగా రాయి తగిలి కిందపడటంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, కుమార్తె ఉన్నారు.