News March 1, 2026

నంద్యాల జిల్లాలో మటన్ రూ. 1000

image

నంద్యాల జిల్లాలోని మాంసం దుకాణాల వద్ద ఆదివారం కావడంతో రద్దీ ఎక్కువగా ఉంది. జిల్లాలోని నంద్యాల, వెలుగోడు, ఆళ్లగడ్డ వంటి పలు ప్రాంతాల్లో వినియోగదారులు మాంసాన్ని కొనుగోలు చేస్తున్నారు. ఈరోజు కేజీ మటన్ రూ.1000 విక్రయిస్తున్నారు. చికెన్ స్కిన్‌లెస్ రూ.250, విత్ స్కిన్ రూ.230, చికెన్ లైవ్ రూ. 195, చేపలు కేజీ రూ.180, గుడ్లు డజను రూ.70గా ఉన్నాయి.

Similar News

News March 3, 2026

జర్మనీ వెళ్తూ దోహా ఎయిర్‌పోర్టులో చిక్కుకున్న సిక్కోలు వాసి

image

శ్రీకాకుళం మండలం సింగుపురానికి చెందిన పుట్రేవు వెంకట సత్య గౌతమ్ ఖతర్‌లోని దోహా ఎయిర్ పోర్టులో చిక్కుకున్నాడు. ఇతను బెంగళూరులోని సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్నానని, కంపెనీ ఆదేశాల మేరకు జర్మనీ ఫ్లైట్లో వెళ్తుండగా యుద్ధం వాతావరణం నెలకొనడంతో దోహా ఎయిర్ పోర్టులో విమానాన్ని నిలిపివేశారు. దీంతో ఎటు వెళ్లలేని పరిస్థితి నెలకొందని ఆయన కుటుంబీకులకు తెలిపాడు.

News March 3, 2026

అమెరికా స్వార్థంతోనే యుద్దాలు: CPI నారాయణ

image

అమెరికా స్వార్థంతోనే పశ్చిమ ఆసియా దేశాల్లో యుద్ధం జరుగుతోందని CPIజాతీయ నాయకులు కె.నారాయణ తెలిపారు. 3వ ప్రపంచ యుద్ధంగా ఈ పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉందనే చర్చ జరుగుతోందని చెప్పారు. ఎవరు ఆరంభించారో వారే యుద్దానికి ముగింపు పలకాలని హితవు పలికారు. కొత్తపేట CPI కార్యాలయంలో మంగళవారం నారాయణ మాట్లాడారు. యుద్దాల ప్రభావంతో ఆయిల్, ఇతర నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి పేద మధ్యతరగతి ప్రజలుఇబ్బంది పడతారన్నారు

News March 3, 2026

9 మంది రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన BJP

image

9 మంది రాజ్యసభ అభ్యర్థులను బీజేపీ ప్రకటించింది. పార్టీ కొత్త అధ్యక్షుడు నితిన్ నబీన్, శివేశ్ కుమార్ బిహార్ నుంచి ఎంపిక కానున్నారు. అస్సాం నుంచి తెరాశ్ గోవల్ల, జోగెన్ మోహన్, ఛత్తీస్‌గఢ్ నుంచి లక్ష్మీ వర్మ, హరియాణా నుంచి సంజయ్ భాటియా, ఒడిశా నుంచి మన్మోహన్ సమాల్, సుజీత్ కుమార్, బెంగాల్ నుంచి రాహుల్ సిన్హాను సెలక్ట్ చేసింది. ఈ నెల 16న ఎన్నికలు జరగనున్నాయి.