News October 3, 2024
నంద్యాల జిల్లాలో మహిళ హత్య

నంద్యాల జిల్లాలో మరో దారుణ హత్య జరిగింది. కొలిమిగుండ్ల మండలం కనకాద్రిపల్లిలో ఓ భర్త భార్యను కిరాతకంగా చంపాడు. భార్యపై అనుమానంతో గొడ్డలితో నరికి చంపినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News April 14, 2026
KBR బార్ గొడవ కేసులో మరో ఇద్దరి అరెస్ట్: డీఎస్పీ

కర్నూలు కేబీఆర్ బార్ వద్ద జరిగిన గొడవలో విద్యార్థి జాన్ వేస్లీ మృతి కేసులో మరో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్లు DSP ఉపేంద్ర బాబు తెలిపారు. ఇప్పటికే ఐదుగురిని అరెస్ట్ చేయగా, తాజాగా రాజీవ్ నగర్‌కు చెందిన శాంతిరాజు రెడ్డి, తులాసాపురం శ్రీకాంత్‌లను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. ఈ కేసులో మరికొంత మంది నిందితులను గుర్తించినట్లు, వారి అరెస్టుకు చర్యలు కొనసాగుతున్నాయని డీఎస్పీ వివరించారు.

నిరుద్యోగులకు జాబ్ మేళా

యువత జాబ్ మేళాను సద్వినియోగం చేసుకుని ఉపాధి పొందాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.సిరి సూచించారు. ఏప్రిల్ 21న ఎమ్మిగనూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉదయం 9:30 నుంచి ఈ మేళా నిర్వహించనున్నారు. 11 ప్రైవేట్ కంపెనీల్లోని 650 ఖాళీల భర్తీకి ఇంటర్వ్యూలు జరుగుతాయి. 18 నుంచి 35 ఏళ్ల వయస్సు ఉండి, పదో తరగతి నుంచి పీజీ వరకు చదివిన వారు పాల్గొనవచ్చని ఆమె తెలిపారు.