News March 19, 2026
నంద్యాల జిల్లాలో యువకుడి సూసైడ్

బండి ఆత్మకూరు మండలం కడమల కాలువ గ్రామంలో తలారి వెంకటేశ్వర్లు(17) ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్ఐ జగన్మోహన్ తెలిపారు. ఆయన వివరాల మేరకు.. తల్లి ఐదేళ్ల క్రితం మాల బాలేస్ అనే వ్యక్తితో ఇంటి నుంచి వెళ్లిపోయింది. నెల కిందట తిరిగి ఇంటికి వచ్చింది. అప్పటి నుంచి తల్లితో గొడవ పడేవాడు. ‘నీ వల్ల గ్రామంలో మా పరువు పోయింది’ అంటూ బాధపడుతూ ఉరేసుకున్నట్లు తండ్రి ఫిర్యాదు చేశారు.
Similar News
News April 14, 2026
HYD: అందమైన అమ్మాయిలతో సంపాదన

యువతే వీరి టార్గెట్. అందమైన అమ్మాయిలతో ఆడియో, వీడియో <<19614819>>కాల్స్<<>> అంటూ ఈ యాప్స్ వ్యాపారం చేస్తున్నాయి. వీటి మోజులో పడి యువతి, యువకులు అనేక కేసుల్లో తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. దోస్త్, కనెక్ట్, ఫ్రెండ్ లాంటి యాప్స్‌పై Gen-S సర్వేలో కీలక విషయాలు బయటపడ్డాయి. 18- 45 ఏళ్ల మహిళలు ఈ యాప్స్ ద్వారా డబ్బు సంపాదిస్తున్నారని, యువకులు వారితో మాట్లాడటానికి డబ్బు, సమయం వృథా చేసుకుంటున్నట్లు పేర్కొంది.
News April 14, 2026
సంగారెడ్డి: TGRJC ప్రవేశాలు.. రేపే చివరి తేదీ

తెలంగాణ గురుకుల జూనియర్ కళాశాలల్లో ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవడానికి బుధవారంతో గడువు ముగియనుందని మునిపల్లి మండలం లింగంపల్లి కళాశాల ప్రిన్సిపల్ చైతన్య తెలిపారు. ప్రస్తుతం 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ www.tgrjc.cgg.gov.in ద్వారా రూ. 200 ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మే 3న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తామని పేర్కొన్నారు.
News April 14, 2026
చిత్తూరు: పుంజుకుంటున్న టమాటా ధరలు

సరైన గిట్టుబాటు ధర లేక నష్టపోతున్న టమాట రైతులకు ప్రస్తుతం పెరుగుతున్న ధరలు ఆశలు రేకెత్తిస్తున్నాయి. పలమనేరులో సోమవారం టమాటా బాక్సు (14 కిలోలు) ధర రూ.400 పలికింది. నాలుగు రోజుల కిందట బాక్సు రూ.200 ఉండగా రోజుకి యాభై చొప్పున ధర పెరుగుతూ వస్తోంది. వేసవి ప్రభావంతో పంట దిగుబడులు తగ్గడంతో ధర పెరుగుతోంది. మరింత ధరలు పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వస్తున్నాయి.


