News September 6, 2025

నంద్యాల జిల్లాలో యూరియా కొరత లేదు: మంత్రి ఫరూక్

image

నంద్యాల జిల్లాలో ఎటువంటి యూరియా కొరత లేదని మంత్రి ఫరూక్ పేర్కొన్నారు. జిల్లాకు రెండు రోజులలో 5,200 యూరియా వచ్చిందన్నారు. యురియాను జిల్లాలోని 162 రైతు సేవా కేంద్రాలకు 3,245 మెట్రిక్ టన్నుల యూరియా మార్క్‌ఫెడ్ ద్వారా సరఫరా చేస్తున్నామన్నారు. యూరియా సరఫరాపై రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. రైతులకు అవసరమైన యురియాను కూటమి ప్రభుత్వం అందజేస్తుందన్నారు.

Similar News

News September 7, 2025

త్వరలో కేటీఆర్ జిల్లాల పర్యటన!

image

TG: లోకల్ బాడీ ఎన్నికల సన్నద్ధతలో భాగంగా BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈ నెల 10, 11 తేదీల్లో కొత్తగూడెం, భద్రాచలం నియోజకవర్గాల్లో, 13న గద్వాలలో ఆయన పర్యటిస్తారు. దసరాలోగా వీలైనన్ని జిల్లాలు, అసెంబ్లీ నియోజకవర్గాలను చుట్టేయాలని ఆయన భావిస్తున్నట్లు సమాచారం. ఇటు స్థానిక సంస్థలతో పాటు అటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపైనా దృష్టి సారించనున్నట్లు తెలుస్తోంది.

News September 7, 2025

వడ్డెర కార్పొరేషన్ డైరెక్టర్‌గా శ్రీదేవి

image

రాష్ట్ర వడ్డెర కార్పొరేషన్ డైరెక్టర్‌గా హిందూపురం నియోజకవర్గం చిలమత్తూరు మండలానికి చెందిన శ్రీదేవిని కూటమి ప్రభుత్వం నియమించింది. మండల పరిధిలోని కొడికొండ చెక్ పోస్టుకు చెందిన శ్రీదేవి టీడీపీలో క్రియాశీలకంగా పనిచేశారు. తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా అభివృద్ధికి కృషి చేస్తానని ఆమె తెలిపారు.

News September 7, 2025

నేడే చంద్ర గ్రహణం.. ఈ పనులు మానుకోండి

image

నేడు రాత్రి 9.58కి చంద్ర గ్రహణం మొదలుకానుంది. కానీ <<17628465>>సూతక కాల<<>> ప్రభావం మధ్యాహ్నం 12.57 నుంచే ఉంటుందని పండితులు చెబుతున్నారు. ‘ఈ సమయంలో ఆహారం తీసుకోవద్దు. వండుకోవద్దు. ముందే వండిపెట్టిన ఆహారంపై దర్భ గడ్డి/తులసి ఆకులు వేసి ఉంచాలి. లేదంటే కలుషితం అవుతుంది. గ్రహణ సమయంలో శుభకార్యాలు, పూజలు వద్దు. SEP 8, 1.26AMకి గ్రహణం ముగుస్తుంది. ఆ తర్వాత దానాలు చేస్తే విశిష్టమైన ఫలితాలు లభిస్తాయి’ అని సూచిస్తున్నారు.