News July 10, 2025

నంద్యాల జిల్లాలో 3.14 లక్షల మంది: కలెక్టర్

image

నంద్యాల జిల్లాలోని 1,959 ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో 1 నుంచి 10వ తరగతి వరకు 3.14 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారని కలెక్టర్ రాజకుమారి తెలిపారు. వెలుగోడులో ఆమె మాట్లాడుతూ.. మన ఎదుగుదలను కోరుకునేది మన గురువులేనన్నారు. ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతున్నారని కొనియాడారు. పిల్లలు ఉన్నత స్థాయికి ఎదిగేలా తల్లిదండ్రులు మార్గనిర్దేశం చేయాలన్నారు.

Similar News

News July 11, 2025

NZB: గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు అరెస్ట్

image

నిజామాబాద్ మూడవ టౌన్ పరిధిలో గంజాయి విక్రయిస్తున్న ఇద్దరిని అరెస్టు చేసినట్లు SI హరిబాబు గురువారం తెలిపారు. పంబౌలి ఏరియాలో గంజాయి విక్రయిస్తున్నారనే పక్క సమాచారం మేరకు పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో షేక్ అఫ్రోజ్, షేక్ అయాజ్ ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. వీరు నుంచి 238 గ్రాముల గంజాయిని స్వాధీన పరుచుకొని, రిమాండ్‌కు తరలించారు.

News July 11, 2025

KMR: క్రీడా అకాడమీల్లో ప్రవేశాలకు ఎంపికలు

image

TG రాష్ట్ర క్రీడా అకాడమీల్లో ఈ ఏడాది ప్రవేశాలకు ఎంపికలు నిర్వహించనున్నట్లు కామారెడ్డి జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి జగన్నాథన్ తెలిపారు. హాకీ, అథ్లెటిక్స్ (గచ్చిబౌలిలో బాలురు, బాలికలకు), హ్యాండ్‌బాల్, ఫుట్‌బాల్ అకాడమీలు (LB స్టేడియంలో బాలురకు మాత్రమే) ఈ ఎంపికలు జూలై 15, 16 తేదీల్లో ఉంటాయన్నారు.12 నుంచి 16 వయస్సు గల అర్హులైన వారు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

News July 11, 2025

సింగరేణిని రేవంత్ రెడ్డి పట్టించుకోవడం లేదు: కవిత

image

బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు అమలు చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చి విస్మరిస్తోందని MLC కవిత మండిపడ్డారు. 42% రిజర్వేషన్లు ఇవ్వకుండా ఎన్నికలు నిర్వహిస్తే చూస్తూ ఊరుకోబోమన్నారు. ఇందుకోసం ఈనెల 17న రైల్ రోకో నిర్వహిస్తున్నామ చెప్పారు. సింగరేణిని రేవంత్ రెడ్డి పట్టించుకోవడం లేదనీ, సింగరేణిలో డిపెండెంట్ ఉద్యోగాలు రావడం లేదన్నారు.