News March 17, 2025
నంద్యాల జిల్లాలో 394 మంది గైర్హాజరు

నంద్యాల జిల్లా పరిధిలో సోమవారం తొలిరోజు పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. 394 మంది పరీక్షలకు గైర్హాజరైనట్లు DEO జనార్దన్ రెడ్డి తెలిపారు. మొత్తం 24,907 మంది పరీక్షలు రాయాల్సి ఉంది. 24,513 మంది పరీక్షలు రాశారని డీఈవో చెప్పారు.
Similar News
News December 15, 2025
AP న్యూస్ రౌండప్

* నెల్లూరు మేయర్ స్రవంతి రాజీనామాను కలెక్టర్ హిమాన్షు ఆమోదించారు. త్వరలో కొత్త మేయర్ ఎన్నికకు నోటిఫికేషన్ వెలువడే అవకాశం.
* రఘురామకృష్ణరాజును హింసించారనే ఆరోపణల కేసులో ఐపీఎస్ సునీల్ కుమార్ ఇవాళ గుంటూరు పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరుకానున్నారు.
* ఏపీ లిక్కర్ కేసులో బాలాజీ గోవిందప్ప, కృష్ణమోహన్‌రెడ్డి, ధనుంజయ్ బెయిల్ పిటిషన్లపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది.
News December 15, 2025
చివ్వెంల మండలంలో గెలిచింది వీరే

గుంపుల – పద్మమ్మ (BRS), ఉండ్రుగొండ – రామకృష్ణ (కాంగ్రెస్), జగనతండా – వీర (BRS), చందుపట్ల (B) – ఉదయశ్రీ (కాంగ్రెస్), తిరుమలగిరి (G) – కె.నాగయ్య (కాంగ్రెస్), వల్లభాపురం – వీరేశ్(BRS), వాల్యతండా – నాగులు (BRS),
గుంజలూరు – సైదయ్య (కాంగ్రెస్), మున్యానాయక్ తండా – సుశీల (స్వతంత్ర), రోళ్లబండ తండా – భీమానాయక్ (BRS),
వట్టిఖమ్మంపహాడ్ – ఈదయ్య (కాంగ్రెస్).
News December 15, 2025
నిర్మల్: 68 సీట్లు కైవసం చేసుకున్న కాంగ్రెస్

మొదటి, రెండవ విడతలో పంచాయతీ ఎన్నికల్లో నిర్మల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ 68 సర్పంచ్ సీట్లు కైవసం చేసుకుంది. ప్రజలు అధికార పార్టీకే మొగ్గు చూపుతున్నారు. ఈ మేరకు జిల్లాలో కాంగ్రెస్ హవా కనిపిస్తోంది. జిల్లాలో పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి.


